సంక్రాంతికే ఆ నాలుగు సినిమాలు..!
లాక్ డౌన్ 4.0లో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వలేదు. సెప్టెంబర్ 31వరకు థియేటర్స్ మూసే ఉంటాయి. కనీసం దసరాకు అయినా తెరుచుకుంటాయన్న నమ్మకం లేదు. దీంతో అందరి దృష్టీ సంక్రాంతిపైనే. షూటింగ్ మొదలైతే సంక్రాంతిని టార్గెట్ చేయాలనుకున్న ఆర్ఆర్ఆర్ 2021 సమ్మర్ కు వెళ్లిపోయింది. 30రోజుల పాటు షూటింగ్ జరిగితే చాలు.. వకీల్ సాబ్ పూర్తవుతుంది. దసరా తర్వాత షూట్ స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ తో నిర్మాత దిల్ రాజు ఉన్నాడట.
సంక్రాంతి సీజన్ లో వస్తోన్న పెద్ద సినిమా వకీల్ సాబ్ ఒక్కటే. అందరికంటే ముందే నితిన్, అఖిల్ సంక్రాంతిని బుక్ చేసేసుకున్నారు. అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ 70శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే షూట్ మొదలుపెట్టారు. వీళ్ల దూకుడు చూస్తుంటే సంక్రాంతికి రావడం గ్యారెంటీ.
అఖిల్ మూవీ కంటే ముందే.. నితిన్ సినిమా రంగ్ దే సంక్రాంతికి విడుదలంటూ నిర్మాతలు ప్రకటించారు. నితిన్ మ్యారేజ్ సందర్భంగా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఆగస్ట్ లో షూట్ మొదలైతే.. సీటీ మార్, క్రాక్ సినిమాలు దసరాకు వచ్చేవి. దసరాకు ఇంకా నెల మాత్రమే సమయం ఉంది. అప్పటికి థియేటర్స్ కు పర్మీషన్ ఇచ్చినా.. కరోనా తర్వాత థియేటర్స్ కు వచ్చే వారి సంఖ్య మొదట్లో తక్కువగా ఉంటుంది.