
మహేష్ ఆ డైలాగ్ చెబుతూ ప్రియ దర్శిని ఆట పట్టించేవాడట..
ఇక విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో చేసినప్పటి సంగతులను గుర్తుచేసుకున్నారు. "మహేష్ గారితో కలిసి పని చేయడం ఖచ్చితంగా డ్రీమ్ కమ్ ట్రూ. స్పైడర్ సినిమా సమయంలోనే మహేష్ గారిని మొదటి సారిగా చూశాను.ఆయన నన్ను గుర్తుపట్టేసి ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. అప్పుడు ఇది చాలు ఈ జీవితానికి అనిపించింది. ఒక సూపర్‌స్టార్ మనల్ని గుర్తుపట్టి మాట్లాడించడం అంటే అంతకంటే సంతోషం ఇంకేం ఉంటుంది. షూటింగ్ లో ఒక సరదా సంఘటన జరిగింది.
నేను తమిళంలో ఒక డైలాగ్ సరిగ్గా పలకలేదు దాంతో సెట్లో అందరూ నవ్వేశారు. అప్పటి నుంచి నేను కనిపించినప్పుడల్లా మహేష్ గారు ఆ డైలాగ్ చెబుతూ నన్ను ఆటపట్టించేవారు. అలాగే ‘పెళ్లి చూపులు’లో నా మాడ్యులేషన్ గురించిన ప్రస్తావన తెస్తూ నవ్వించేవారు.మహేష్ గారు ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు చాలా చేసేవారు. ఆయనిది గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయన వేసే కౌంటర్స్ చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఇన్‌క్రెడిబుల్ గా నవ్వుకునేవాళ్ళం. ఆయన టైమింగ్ అసలు మామూలుగా ఉండదు.
ఆయన ఇంటర్వ్యూలు లేక ప్రెస్ తో మాట్లాడుతున్నప్పుడు చూడండి, కౌంటర్లు భలే వేస్తూ ఉంటారు కదా. అలాంటిది ఆయనను సెట్స్ లో, ఫ్రెండ్స్ తో ఊహించుకోండి ఎలా ఉంటారో. ఎంతో నవ్వుకునేటట్లుగా అసలు ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ వేరే లెవల్.భలే ఉంటుంది ఆయనతో. ఆయనలో సేవా గుణం చాలా ఎక్కువ. ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియవు ఆ విషయాలు. ఆ విషయాలను బయటికి చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడరు" అని చెప్పుకొచ్చారు ప్రియదర్శి.
ఇక మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ని "గీతా గోవిందం" ఫేమ్ పరశురామ్ పెట్ల డైరెక్ట్ చెయ్యబోతున్నాడు.