బాలయ్యకు ముద్దుగుమ్మ దొరికిందా..?
బాలకృష్ణ-బోయపాటి సినిమా అనౌన్స్ మెంట్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ‘సింహా, లెజెండ్’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీ ఇదే రేంజ్ లో ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన టీజర్ తో ఈ సినిమాలపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. అయితే ఇంత భారీ బజ్ ఉన్న ఈ సినిమాకి ఇప్పటివరకు హీరోయిన్ ఫిక్స్ అవ్వలేదు.
బాలకృష్ణ-బోయపాటి సినిమాకు ఇంతకుముందు అంజలిని హీరోయిన్ గా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ బోయపాటి ఫ్రెష్ కాంబో కోసం చూస్తున్నాడనే టాక్ వచ్చింది. ముంబయి నుంచి హీరోయిన్ ని తీసుకొస్తున్నారనే మాటలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఫైనల్ కాలేదు.
సీనియర్ హీరోలు ఇప్పటికీ స్టార్ రేసులో ఉన్నారు. కానీ ఎంత స్టార్డమ్ ఉన్నా సీనియర్లతో సినిమాలు చేస్తే సీనియర్ హీరోయిన్ అనే ట్యాగ్ వస్తుంది. ఇక ఈ ట్యాగ్ వస్తే యంగ్ స్టర్స్ పక్కనపెట్టేస్తారు. స్టార్ హీరోలు కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉండదు. దీంతో కెరీర్ ఆలస్యం అయ్యే ప్రమాదముంది. అందుకే సీనియర్లతో సినిమాలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారట స్టార్ హీరోయిన్లు.
మొత్తానికి అగ్రహీరోలకు హీరోయిన్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సీనియర్ హీరోల సరసన నటిస్తే.. అవకాశఆలు తగ్గిపోతాయనే భావనలో ఉన్నారు ముద్దుగుమ్మలు. అందుకే అగ్రహీరోలు అనగానే సున్నితంగా మొహం చాటేస్తున్నారు. ఈ పెద్ద హీరోలకు హీరోయిన్లను సెట్ చేసేందుకు.. డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు నానా తంటాలు పడుతున్నారు.