ప్రముఖ టీవీ ఛానల్ రామ్ "రెడ్" కి షాక్ ఇచ్చింది.. !!!!!

frame ప్రముఖ టీవీ ఛానల్ రామ్ "రెడ్" కి షాక్ ఇచ్చింది.. !!!!!

Purushottham Vinay
హీరో రామ్.. "దేవదాస్" సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. తనదైన నటనతో ఎంతగానో ఆకట్టుకొని దేవదాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నే సొంతం చేసుకున్నాడు. వైవియస్ చౌదరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంవత్సరం ఆడి పెద్ద హిట్ ఏ అయింది. తర్వాత రామ్ తీసిన "జగడం" సినిమా ప్లాప్ అయినా తర్వాత వరుసగా మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించాడు. మంచి మంచి లవ్ స్టోరీస్ చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించాడు.  కాకుంటే రామ్ కి ఎప్పట్నుంచో మాస్ హీరో అనిపించుకోవాలని కోరిక వుంది. ఆ కోరిక గత సంవత్సరం లో వచ్చిన "ఇష్మార్ట్ శంకర్" సినిమాతో తీరిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మాస్ ఆడియెన్స్ కు దగ్గరైన రామ్.. తరువాత కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘రెడ్’ అనే చిత్రం చేశాడు. రామ్ సొంత బ్యానర్ అయిన ‘శ్రీ స్రవంతి మూవీస్’ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించింది. రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన ‘రెడ్’ .. తమిళ ‘తడం’ ఇన్స్పిరేషన్ తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు రెండు పాటలు.. సినిమా పై మంచి బజ్ ఏర్పడేలా చేశాయి.

బిజినెస్ కూడా ఈ చిత్రానికి బాగానే జరిగిందని టాక్.శాటిలైట్ రైట్స్ ను కూడా ఫ్యాన్సీ రేటుకి జెమినీ వారు సొంతం చేసుకున్నారట. ఇదిలా ఉండగా.. ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేనందున ‘రెడ్’ ను ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారట. కానీ అందుకు జెమినీ వారు అడ్డుచెబుతున్నట్టు టాక్. విషయం ఏమిటంటే.. ‘రెడ్’ ను కనుక ఓటిటిలో విడుదల చెయ్యాలనుకుంటే శాటిలైట్ రైట్స్ కు అమ్మిన అమౌంట్ తగ్గించి వెనక్కి ఇవ్వాలని కోరిందట.

అందుకు ‘రెడ్’ దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదు. కావాలంటే నెట్ ఫ్లిక్స్ వాళ్ళతో పాటు నాలుగు రోజులు పోయాక సన్ నెక్స్ట్ లో కూడా ‘రెడ్’ ను పెట్టుకోవచ్చని ఆఫర్ ఇచ్చారట. కానీ ఆ ఆఫర్ ను జెమినీ వారు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దాంతో ‘రెడ్’ టీం మళ్ళీ డైలమాలో పడినట్టు తెలుస్తుంది.దీనిని బట్టి చూస్తుంటే ‘రెడ్’ ఓటిటి రిలీజ్ లేనట్టేనని స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: