రియా డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. తెరమీదకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పేరు..?

praveen
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఎన్నో ఊహించని పరిణామాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీబీఐ  చేతిలోకి  ఈ కేసు విచారణ రావడంతో ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ కేసులో రోజుకు ఒక కొత్త కోణం బయటపడుతూ అందరిని ఊహించని షాక్ ఇస్తోంది. కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నే కాదు సౌత్ సినీ ఇండస్ట్రీ కి  కూడా ఈ కేసు పాకి  పోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీబీఐతో పాటు ఈడి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రంగంలోకి దిగి ఈ కేసు ముమ్మర దర్యాప్తు ప్రారంభించి కీలక ఆధారాలు సేకరించే పనిలో పడిన విషయం తెలిసిందే.



 ఇప్పటికే అరెస్టు అయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ని  విచారిస్తున్నారు అధికారులు. ఇటీవలే డ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు అరెస్టయిన విషయం తెలిసిందే. రియా చక్రవర్తి విచారణలో భాగంగా మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సారా అలీ ఖాన్ ల పేర్లు కూడా కూడా తెరమీదకు రావడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వీరే కాకుండా మరో 25 మంది పేర్లు కూడా రియా చక్రవర్తి విచారణలో బయట పెట్టినట్లు తెలుస్తోంది.



 దీంతో ప్రస్తుతం రియా చక్రవర్తి కేసులో బయటపడ్డ నిజాలు అటు బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు సౌత్ ఇండస్ట్రీని  కూడా వనికిస్తున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి 25 మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టినట్లు  మీడియాలో కథనాలు వస్తుండగా.. వీరిలో  బాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ కి రియా కి  ఈ మధ్య మంచి స్నేహ బంధం ఉందని ఇటీవల సోషల్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు  రకుల్ పేరు బయటకు రావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: