టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయినటువంటి అనిల్ సుంకర.... నమో వెంకటేశ, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ఈడోరకం ఆడోరకం, కిరాక్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలను తెలుగు సినీ ప్రేక్షకులకు అందించారు...దూకుడు సినిమా ద్వారా రెట్టింపు గుర్తింపు తెచ్చుకొని సరికొత్త జోష్ తో దూసుకుపోతున్నారు ఈ మహా నిర్మాత. సరిలేరు నీకు ఎవ్వరు... బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఈయన నిర్మాణంలో రూపుదిద్దుకుంది. నూతన చిత్రాలను నిర్మించే విషయంలో మంచి దూకుడు మీదున్న నిర్మాత అనిల్ సుంకర.. వరుసపెట్టి తను చేయ బోతున్న తదుపరి ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు...
ఇప్పటికే కొందరు స్టార్ హీరోలతో ప్రముఖ దర్శకులతో.... కలిసి సినిమాలు నిర్వహించేందుకు ఒప్పందాలు కూడా కుదిరిపోయాయని తెలుస్తోంది. ఈ చిత్రాలలో మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టు కూడా ఉండడం విశేషం...ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా విషయానికి వస్తే.... ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా, ఆ తదుపరి అక్కినేని నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్ మొదలు కానున్నట్లు టాక్... అయితే దీనిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అలాగే మన యంగ్ హీరో అక్కినేని ఇంటి చిన్న వారసుడు అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు నిర్మాత అనిల్ .
అఖిల్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు నిర్మాత అనిల్ సుంకర. ఈ విషయంపై ఈరోజు ఉదయం 09.09.09 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లు వెల్లడించారు. ఇక హీరో విషయానికొస్తే ఈ సినిమాలో అఖిల్ గూడచారి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్త వినిపిస్తోంది... అఖిల్ ఐదవ సినిమా స్టార్ట్ కాబోతుంది అన్న వార్త తెలుసుకున్న అక్కినేని కుటుంబ అభిమానులు ఈసారి అఖిల్... సురేంద్ర దర్శకత్వంలో, అనిల్ సుంకర నిర్మాణం లో బ్లాక్ బస్టర్ ను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.