అల్లు అర్జున్ 'పుష్ప' లో ఎర్రచందనం మాత్రమే కాదా ....  ఎర్రి పుష్పం కాన్సెప్ట్  కూడానా......??

GVK Writings
ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్‌డౌన్‌ కు ముందు శేషాచలం అడవుల్లో రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం తెలిసిందే. ఎర్రచందన గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నలు ఇద్దరూ పక్కా మాస్ పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో నారా వారి హీరో రోహిత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా అందుతున్నసమాచారం ప్రకారం, ఈ సినిమాని మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన్నాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి యాక్షన్ సీన్స్ తో కొనసాగే సినిమా, సెకండాఫ్ కి వచ్చేసరికి గతంలో శ్రీను వైట్ల  తీసిన సినిమాల్లో మాదిరిగా అతని పక్కనే ఉంటూ విలన్ని హీరో తెలివిగా దెబ్బతీసే ఫార్ములా తో సాగుతుందని, అలానే ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా ఉండనున్నాయని అంటున్నారు.

ఒకరకంగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తను బట్టి చూస్తుంటే పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగటమే కాక విలన్ని ఎర్రి పుష్పం చేసే కాన్సెప్టుతో కూడా సాగనుందని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: