అందరిదీ ఓ దారి అయితే.. ఆ ఇద్దరి ఇంకో దారి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎక్కువగా రిమేక్ లకే ప్రాధాన్యత ఇచ్చాడు. తమ్ముడు, సుస్వాగతం, అన్నవరం, తీన్ మార్, గబ్బర్ సింగ్ , కాటమరాయుడు, గోపాల గోపాల - ఇవన్నీ రీమేకులే. పవన్ సినిమాలు కూడా చాలా చోట్లకు రీమేకులుగా వెళ్లాయి. సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి.. రాజకీయాల్లో అడుగుపెట్టి.. తర్వాత మళ్లీ సినిమాల బాట పట్టిన తర్వాత పవన్ మళ్లీ రీమేక్ కే జైకొట్టాడు. వకీల్ సాబ్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ ప్రాజెక్ట్ పింక్ చిత్రానికి రీమేక్ ఈ సినిమా.
ఇక విక్టరీ వెంకటేశ్ విషయానికొస్తే.. ఆయన ఇప్పటి వరకు 73 సినిమాల్లో నటిస్తే.. అందులో 28 సినిమాలు రీమేక్‌లే కావడం విశేషం. ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘నారప్ప’ తన రీమేకుల లిస్ట్ లలో 29వ సినిమా కావడం విశేషం. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కి రీమేక్‌గా నారప్ప రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తోన్న ఈఫిలింను డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. అసురన్ కథ నచ్చడంతో ఛాలెంజింగ్ పాత్రగా భావించి వెంకీ ఈ ప్రాజెక్ట్ తో ఓ ట్రయల్ వేస్తున్నాడు.