టాలీవుడ్ లో కొత్త కల్చర్..!

NAGARJUNA NAKKA
టాలీవుడ్ లో కొత్త కల్చర్ వచ్చేసింది. తెలుగులో తీసే సినిమాలు ఎలా ఉన్నా.. రీమేక్ ల సందడి ఎక్కువైపోయింది. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన చిత్రాలన్నీ నేడు తెలుగు చిత్రాలుగా రీమేక్ అవుతున్నాయి.

తెలుగు సినీపరిశ్రమ సీజన్ బట్టి  ట్రెండ్ మార్చుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొత్త కంటెంట్ తో వచ్చే చిత్రాలకు పట్టం కడుతుంది. ఆ సమయంలో స్ట్రయిట్  చిత్రాల తాకిడి కాస్త గట్టిగానే ఉంటుంది. వన్స్  కొత్త కథలు రాక తగ్గినప్పుడు మాత్రం...మళ్లీ మన పరిశ్రమ పక్క పరిశ్రమల వైపు చూస్తుంది. ఆయా భాషలలో ప్రేక్షకాదారణ పొందిన చిత్రాలను.. తెలుగు రీమేక్ రైట్స్ కొని ఇక్కడ రూపొందిస్తుంటుంది.

మన టాలీవుడ్ లో పేరొందిన ప్రొడక్షన్ హౌస్ లు ... బయటి పరిశ్రమలో మంచి కథతో ఏదైనా సినిమా హిట్ అయితే చాలు... ఆ సినిమా రైట్స్ అందరికంటే ముందుగా ఎలా కొనేయాలా అని చూస్తుంటాయి. ఒకవేల ఆ సినిమా రైట్స్ వారికి దక్కకపోతే ఆ సమయంలో అదే భాషలో హిట్ అయిన మిగిలిన చిత్రాలన్నింటిని ఫిల్టర్ చేసేస్తుంటాయి. వాటిలో ఏమైనా మంచి కథ తగలకుండా పోతుందా అనే భ్రమలలోనే మనవాళ్లు బతికేస్తున్నారు తప్ప.. మన రైటర్స్ తో కథా బలమున్న చిత్రాలను  తయారు చేసుకుందామనే సీరియస్ నెస్ చూపించలేకపోతున్నారు.

అసలు తెలుగులో ఈ రీమేక్  కల్చర్ ను ఇంతగా ఎంకరేజ్ చేసినవారిలో సూపర్ గుడ్ ఫిలింస్ అధినేతలను ప్రధానంగా  చెప్పుకోవాలి. తమిళంలో ఓ సినిమా హిట్ అయితే చాలు..ఆ సినిమా రైట్స్ కొనడం, ఇక్కడ  మార్కెట్ ఉన్న హీరోలతో కంటిన్యూగా సినిమాలు చేయడం వారికి అప్పట్లో పరిపాటి అయిపోయింది. దాదాపు 10 నుంచి 15ఏళ్ల పాటు వారు ఈ రీమేక్ కల్చర్ ను తెలుగులో పెంచి పోషించారు. మొత్తానికి తెలుగునాట రీమేక్ హవా కొనసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: