సాహసంలో కార్నెర్ అవుతున్న దిల్ రాజ్ !
ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలుగా దర్శకులుగా యంగ్ జనరేషన్ ఎంటర్ అవుతోంది. వీరంతా చాలవేగంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఒక టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ కనిపిస్తే చాలు వారి చేతిలో డబ్బు అడ్వాన్స్ లుగా పెట్టి వెంటనే వారు మరొక వైపుకు మళ్ళకుండా నిర్మాతలు కార్నర్ చేస్తున్నారు. అయితే దిల్ రాజ్ మటుకు ఈరేసులో వెనక్కువెళుతూ ప్రస్తుత పరిస్థితులలో పరుగులు తీయలేకపోతున్నాడు అన్నది కొందరి అభిప్రాయం.
ముఖ్యంగా మైత్రీ మూవీస్ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ 14 రీల్స్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ యువి క్రియేషన్స్ లాంటి సంస్థలు యంగ్ డైరెక్టర్స్ కనిపిస్తే చాలు కార్నర్ చేస్తున్న పరిస్థితులలో ఈరేసులో దిల్ రాజ్ వెనకపడ్డాడు అన్నది కొందరి అభిప్రాయం. దీనికితోడు ప్రస్తుతం చాలామంది టాప్ హీరోలు తమ సొంత కుటుంబ సభ్యులచేత నిర్మాణ సంస్థలు పెట్టిస్తున్నాయి.
అలాగే పెద్ద డైరెక్టర్లు కూడ తాము తీసే సినిమాలలో లాభాలలో వాటాలు అడుగుతున్నారు. ఇలా మారుతున్న విషయాలకు దిల్ రాజ్ రాజీ పడలేకపోతున్నాడు అని కొందరి అభిప్రాయం. ప్రస్తుతం దిల్ రాజ్ క్యాంప్ లో అనీల్ రావిపూడి వంశీ పైడిపల్లి వేణు శ్రీరామ్ నక్కిన త్రినాథ్ రావ్ లాంటి డైరెక్టర్స్ తప్ప మిగతా టాలెంటెడ్ డైరెక్టర్స్ అందరు దిల్ రాజ్ వైపు చూడటం లేదు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. అయితే దిల్ రాజ్ నిర్మిస్తున్న అనేక సినిమాలు ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ ‘వి’ లాంటి సినిమాలు కరోనా పరిస్థితులు వల్ల విడుదల ఆలస్యం అవ్వడంతో పరిస్థితులతో రాజీపడి ‘వి’ మూవీని ఓటీటీ లో విడుదల చేయవలసిన పరిస్థితి దిల్ రాజ్ కు ఏర్పడిందని పరిస్థితులు అన్నీ సద్దుకున్నాక దిల్ రాజ్ స్పీడ్ మళ్ళీ యధాతధంగా కొనసాగుతుందని అతడి సన్నిహితులు అంటున్నారు..