వాళ్లకి అండగా ఉంటానన్న పవర్ స్టార్... !!!!

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" ఈ పేరు వింటేనే అభిమానులు ఉర్రూతలూగిపోతారు. సీనియర్ నటుడు చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో అడుగు పెట్టి తన నటనతో, మంచి మంచి సినిమా లతో తక్కువ సమయంలోనే కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. గొప్ప స్టార్డం సంపాదించి తెలుగు ప్రముఖ హీరోలలో ఒకరిగా నిలిచారు. గతంలో తన అన్న గారి పార్టీ ప్రజారాజ్యం తరుపున నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి సినిమాలలో ఎంత మంచి స్థానం వున్న రాజకీయాలు అంటే మక్కువ. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి మంచి చేయాలని తపన ఆయన లో వుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా శాంతిపురం లో కొందరు అభిమానులు ప్లాన్ చేశారు. అయితే అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ విషాదం నెలకొంది. పవన్ బర్త్ డే బ్యానర్లు పడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో ముగ్గురు అభిమానులు మరణించారు. మరో నలుగురైదుగురికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తానని ఆయన తెలిపారు.

“శాంతిపురం దగ్గర కటౌట్ కడుతుండగా విద్యుత్ షాక్ తగలడంతో జనసైనికులు మరణించాడనే వార్త నా మనసును తీవ్రంగా కలచి వేసింది. సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలను. వారికి బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనక ఆ తల్లిదండ్రులకు నేనేమో బిడ్డగా నిలుస్తా. వారి కుటుంబాలను ఆర్థిక ఆదుకుంటా” అని జనసేనాని పవన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నా జనసైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడమని బాధిత కుటుంబాలతో తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ స్థానిక నాయకులకు సూచించినట్లు పవన్ చెప్పారు.




 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: