బన్నీ ఫ్యాన్స్ మరీ ఇంత అత్యుత్సాహమే మీకు...???
బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ప్రభాస్ ఇమేజ్ మరో స్థాయికి తీసుకెళ్లింది. సాహో విడుదలై ఏడాది పూర్తయిన సంధర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ వేడుక జరుపుకుంటున్నారు. ట్విట్టర్ లో సాహో మరియు ప్రభాస్ పేరున యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పనిగట్టుకొని ఆయన పేరుపై ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడానికి కారణం ఇదే అని తెలుస్తుంది. బాలీవుడ్ లో కూడా ఇమేజ్ తెచ్చుకొని, ఇండియన్ సూపర్ స్టార్ హోదాలో ఉన్న ప్రభాస్ కి పోటీ ఇవ్వాలనే వారు ఎంటర్ అయ్యారట.
ఫాలోయింగ్ లో అల్లు అర్జున్ ఎవరికీ తీసిపోవడని తెలియజెప్పాలని అనుకుంటున్నారట. అందుకే తమ హీరో పేరున ఓ యాష్ ట్యాగ్ భారీగా ట్రెండ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది. కొందరు దీనిని అత్యుత్సహం అంటున్నారు.
మరో పక్క ఈ విషయం జరగగానే బన్నీ పై యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా దారుణంగా కామెంట్లు చేశారు. ఒక అభిమాని అయితే నువ్వు స్టైలిష్ స్టార్ కాదు నువ్వో పెద్ద పబ్లిసిటీ స్టార్ వి. క్రేజ్ ని కూడా డబ్బుతో కొనుక్కునే రకానివి నువ్వు. మళ్ళీ నీకు మహేష్ బాబు, ప్రభాస్ తో పోలికేంటి. అని కామెంట్ చేశాడు. ఈ రకంగా బన్నీ, బన్నీ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఇలాంటి పనులు చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన తిట్ల పాలు అవుతున్నారు.