నటి సిమ్రాన్ జీవితంలో కొత్త మలుపు....

VAMSI
సిమ్రాన్ హీరోయిన్'గా ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన మహానటి. అప్పట్లో పెద్ద హీరోలతోనూ, చిన్న హీరోలతోనూ జతకట్టి వాహ్ వా అనిపించుకున్నారు. తన అందం అభినయంతో కుర్రకారుకు మత్తెక్కించి అన్ని రకాల ప్రేక్షకులను అలరించింది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ముంబై నుంచి వచ్చిన ఈ భామ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఒక ఊపు ఊపింది. మొదటి బాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.




అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన ఈ అందాల తార ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రసారమయ్యే ఓ షోకు యాంకర్ గాను... కొన్ని సీరియల్స్ లోనూ పనిచేశారు. హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ ని పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో వెనుకబడిన సిమ్రాన్... సూపర్ స్టార్ రజనీకాంత్ "పేట" సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.




ప్రస్తుతం తెలుగులో అనిల్ పాదూరి దర్శకత్వంలో,   డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా చేస్తున్న "రొమాంటిక్" చిత్రంలో మాజీ హీరోయిన్ సిమ్రాన్ ఆకాష్ కి అత్తగా అంటే హీరోయిన్ కి తల్లిగా నటిస్తోంది...అనే వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన కేతిక శర్మ కథానాయికగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాను మొదట్లో మే 29 వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేసిన కరోనా లాక్డౌన్ కారణంగా అది కాస్త వాయిదా పడింది...దర్శకేంద్రుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తన తనయుడిని కూడా సినీరంగంలో పెద్ద స్టార్ గా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు... మరి ఈ సినిమా ఆకాష్ పూరికి స్టార్ డమ్  తెస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: