శ్రీ రెడ్డికి కాబోయే భర్త మళ్లీ మారాడా?

VAMSI
సినీ పరిశ్రమపై ఎన్నో ఆరోపణలు చేస్తూ సెన్సేషనల్ న్యూస్ గా మారింది శ్రీరెడ్డి.. గత కొంత కాలంగా ఇండస్ట్రీపై దుమ్మెత్తి పోస్తూ సినీ ప్రముఖులపై ఎన్నో ఆరోపణలు చేస్తూ, వాటికి ఆధారాలను కూడా చూపెడుతూ, తన వ్యక్తిగత రహస్యాలను బట్టబయలు చేసింది శ్రీ రెడ్డి... దీని కారణంగా ఎన్నో వివాదాలు ఎదుర్కొంది... సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తరచుగా పోస్టులు చేస్తుంటారు శ్రీ రెడ్డి. రీసెంట్ గా  రానా పెళ్లి కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రెడ్డి ఆ సందర్భంలో... రానా బావ మీ తమ్ముడి తో నా పెళ్లి ఎప్పుడు? అంటూ సరదాగా  మాట కలిపింది. ఆ తర్వాత ఉచిత సలహాలు ఇచ్చింది అది వేరే సంగతి అనుకోండి..




ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో సంప్రదాయ దుస్తులతో కొత్త పెళ్ళికూతురిలా మెరుస్తూ... నుదుటిన కస్తూరి పెట్టుకొని అచ్చ తెలుగు గృహిణిలా కనిపిస్తూ తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటో తో షాక్ ఇచ్చింది శ్రీ రెడ్డి... ఫేస్ బుక్ లో ఓ ఫోటో షేర్ చేస్తూ ఇదిగో నా భర్త అతని వెనక నా బ్రదర్స్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి... అయితే ఇది నిజమైన పెళ్లి కాదు....గతంలో కూడా ఈమెకు ఆల్రెడీ పెళ్లి అయిందని భర్తతో విభేదాలు వచ్చి విడిపోయిందని చాలా వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు ఈ వార్త కూడా అలాంటిదే మరి.
అయితే ఈసారి తనే స్వయంగా ఈ ఫోటోను పోస్ట్ చేసింది. కానీ దీని వెనుక ఓ కథ ఉంది.




తెలుగులో లాగే తమిళ్ లో కూడా ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది శ్రీ రెడ్డి... దానికి ప్రమోషన్ వీడియో కోసమే ఇలా హోమ్లీ గెటప్ లో మెరిసారట శ్రీ రెడ్డి... ఈ ఫోటో చూసిన నేటి జనులు అవాక్కయ్యారు.... శ్రీ రెడ్డి కి నిజంగానే పెళ్లయిందా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇది కేవలం ఒక ఫోటో షూట్ మాత్రమే అని ప్రస్తుత సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: