ఓటీటీపై నేచురల్ స్టార్ క్లారిటీ..!

NAGARJUNA NAKKA
ఓటీటీలోకి వస్తున్నానని నేచురల్ స్టార్ నాని చెప్పకనే చెప్పేశాడు. డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. హింట్‌ ఇచ్చేశాడు. ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వచ్చేది ఒకటి, రెండు రోజుల్లో చెబుతాడు. నాని విలన్‌గా నటించిన చిత్రం వి. థియేటర్స్‌లోకి మాత్రమే రావాలని ఐదు నెలలుగా వెయిట్‌ చేశాడు. కరోనా పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేటట్టు కనిపించడం లేదు. ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఓటీటీని ఆశ్రయించింది.

నాని తొలిసారి విలన్‌గా.. సుధీర్‌బాబు, నివేద థామస్‌ జంటగా నటించిన  వి మూవీని మార్చి 25న రిలీజ్‌ చేద్దామనుకున్నారు. కరోనాతో వాయిదా పడగా... థియేటర్స్‌ ఓపెన్‌ అవుతాయని చాలాకాలంగా చిత్ర యూనిట్‌ వెయిట్ చేసి చేసి.. అలసిపోయింది. ఓటీటీలోకి రాక తప్పకపోయినా.. టేబుల్‌ప్రాఫిట్‌తో రిలీజ్‌ అవుతోంది. ఎప్పుడు... ఎక్కడ రిలీజ్‌ చేస్తారో.. త్వరలోనే చెప్పబోతున్నారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నసందర్భంగా నానీతో చేసిన వీడియో ఆకట్టుకుంది.

వి సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని నాని డైరెక్ట్‌గా చెప్పలేదు. కానీ.. ఆయన మాటలు వింటే.. వి ఓటీటీలోకి వస్తోందని చిన్న పిల్లాడికి కూడా అర్థమైపోయింది. సినిమాను మళ్లీ మళ్లీ చూస్తాం. తనకు ఎన్ని సార్లు చూడాలనిపిస్తుందో.. అన్ని సార్లు చూస్తామని నాని అన్నాడు. ఇలా ఒకటికి పదిసార్లు చూసేది ఓటీటీలోనే కదా. అలాగే.. ఇల్లే థియేటర్‌గా మారుతోంది... మిడ్‌నైట్‌ నుంచి షోలు మొదలవుతాయంటే అది ఓటీటీలోనే సాధ్యం అంటున్నాడు.  

వి మూవీ ఓటీటీ పబ్లిసిటీ  నాని వీడియోతో మొదలైంది. అన్నీ చెప్పేసిన నాని... ఏదో సీక్రెట్‌ చెబుతానంటూ.. ఓటీటీలో వచ్చే వార్తను రివీల్‌ చేయబోతున్నారు. ఇలా వి పబ్లిసిటీని రెండు రోజులు నడిపించి జనాల్లోకి తీసుకెళ్లాలన్న ప్లాన్‌ నిర్మాతది.  థియేటర్స్‌లోనే రావాలన్న వి యూనిట్‌ కోరిక తీరకపోయినా... ఓటీటీలోనూ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. తెలుగులో రిలీజ్‌ అవుతున్న తొలి ఈ క్రేజీ మూవీ అమోజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ అవుతుందట. మొత్తానికి నేచురల్ స్టార్ నాని ఓటీటీపై క్లారిటీ ఇచ్చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: