అలా గొడవలు రావడంతో విడిపోయాం.. కానీ!
ప్రస్తుతం ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ లో ‘చావు కబురు చల్లగా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడు.
అయితే.. సాధారణంగా సెలబ్రిటీలు వారి ప్రేమ కథల గురించి ఎక్కువగా బయటపడరు. కానీ మన కార్తికేయకు చదువుకునే రోజుల్లో ఓ లవ్ స్టోరీ ఉండేదట. ఆయన మాటల్లోనే…” నా కాలేజ్ డేస్ లో ఓ అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. అది లవ్వో … కాదో కూడా నాకు తెలీదు. అయితే చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. కాలేజ్ పూర్తయ్యాక చిన్న చిన్న గొడవలొచ్చి విడిపోయాం.ఈ క్రమంలో నా సినిమాలు చూసి మళ్లీ నాకు టచ్ లోకి వచ్చింది.
అప్పుడప్పుడు పలకరిస్తుంది.ఇప్పుడు తనతో మాట్లాడుతున్నాను… కానీ ఒకప్పటి ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు తను నాకు కేవలం ఓ ఫ్రెండ్ గా మాత్రమే అనిపిస్తుంది. ప్రస్తుతం నాకు ఎలాంటి ఎఫైర్లు లేవు… సింగిల్ గానే ఉన్నాను” అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు.
కార్తికేయ ప్రస్తుతం అజిత్, హెచ్ వినోద్ కలయిక లో వస్తున్న వలిమై చిత్రం లో విలన్ గా నటించబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ లో కార్తికేయ విలన్ గా చేసిన నటన చూసి ఈ మూవీ లో అజిత్ కి పర్ఫెక్ట్ విలన్ గా సెట్ అవుతాడని తీసుకున్నారట. ఈ సినిమా ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు.