నెటిజన్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చిన అమితాబ్ బచ్చన్..!

Suma Kallamadi
బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ తన అభిమానుల, నెటిజన్ల ప్రశ్నలకు స్పందిస్తుంటారు. ఈ బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రతిరోజు ఇన్ స్టాగ్రామ్ లో ఫేసుబుక్ లో, ట్విట్టర్ లో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. అయితే నిన్న ఒక నెటిజన్ అమితాబ్ బచ్చన్ పోస్ట్ పై ఒక వ్యాఖ్య చేశాడు. అయితే ఈ వాక్య పై స్పందించిన అమితాబ్ బచ్చన్ అదిరిపోయే సమాధానం ఇచ్చి అందర్నీ ఫిదా చేసేశారు.


'అమితాబ్ బచ్చన్, సార్. మీరు మీ పోస్టులను హిందీలో రాస్తే బాగుంటుంది, కదా!!,' అని ఒక నెటిజెన్ అమితాబ్ బచ్చన్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. అయితే కొంత సమయం తర్వాత ఈ ట్వీట్ కి స్పందించిన అమితాబ్ బచ్చన్... ' పోస్ట్ అనే పదాన్ని మీరు కూడా ఇంగ్లీష్ లోనే రాశారు. అది హిందీలో రాస్తే బాగుంటుంది, కదా!!,' అని అదిరిపోయే రిప్లై ఇవ్వడం తో ఆ నెటిజెన్ కిక్కురుమనకుండా సైలెంట్ అయిపోయాడు.




ఇకపోతే జులై 11వ తేదీన తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అమితాబ్ బచ్చన్. నానావతి ఆసుపత్రిలో కొన్ని వారాలపాటు చికిత్స పొందిన  అమితాబ్ బచ్చన్ ఇటీవలే కరోనా నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కేవలం అభిమానుల ప్రార్థనల వల్లనే తాను కరోనా మహమ్మారిని జయించానని అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అమితాబ్ బచ్చన్ తో పాటు ఐశ్వర్యరాయ్, ఆరాధ్య బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు అందరూ ఒకేసారి నానావతి ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ తో పాటు ఐశ్వర్య రాయ్, ఆరాధ్య బచ్చన్ కూడా కరోనా నుండి రికవర్ అయ్యారు. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం కరోనా వైరస్ నుండి కోలుకునేందుకు చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: