నేను కూడా సహాయం చేశా.. కానీ ఫోటోలు మాత్రం తీసుకోలేదు.. సోను సూద్ పై బ్రహ్మానందం..?

frame నేను కూడా సహాయం చేశా.. కానీ ఫోటోలు మాత్రం తీసుకోలేదు.. సోను సూద్ పై బ్రహ్మానందం..?

praveen
కరోనా  వైరస్ సంక్షోభం ఏర్పడి నాటి నుంచి నేటి వరకూ కూడా... సోనూసుద్  తన పెద్ద మనసు  చాటుతూ ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆపద లో ఉన్నాము అంటే చాలు ఆపద్బాంధవుడిగా ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఎంతో మందికి సహాయం అందించారు సోనూసూద్. సినిమాల్లో విలన్ పాత్రలో నటించే సోనుసూద్ నిజజీవితంలో మాత్రం భారత దేశ వ్యాప్తంగా అందరికీ హీరోగా మారిపోయాడు, ఎంతోమందికి సహాయం చేసి తనలోని పెద్ద మనసును చాటుకున్నాడు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో దేవుడీలా  మారిపోయాడు సోను సూద్. దేవుడు ఎక్కడో లేడు సహాయం చేసే సాటి మనిషి లోనే ఉన్నాడు అని మరోసారి నిరూపించాడు.



 అయితే సోనుసూద్ సహాయం చేయడం పై ఎంతో మంది ప్రముఖులు స్పందిస్తూ సోనూసూద్ పెద్ద మనిషి పై ఎంతో ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కాగా  సహాయం కావాలనుకునే వారికి తనను సంప్రదించాలని సోనుసూద్ ఒక నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే సోనుసూద్ పై తాజాగా బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోను సూద్ చేసిన సహాయం పై ప్రశంసలు కురిపిస్తూనే డబ్బు విలువని చెప్పుకొచ్చారు కమెడియన్ బ్రహ్మానందం. సోను సూద్ కూడా వలస వచ్చిన వారే కాబట్టి వలస కార్మికుల కష్టాలను తెలుసుకుని ఆదుకున్నాడు... వలస కార్మికుల జీవితాల్లో ఉదయిస్తున్న సూర్యుడిలా  వెలుగులు నింపాడు అంటూ ప్రశంసలు కురిపించాడు బ్రహ్మానందం.



 అయితే ఈ మధ్య కాలంలో తాను కూడా ఇలాంటి పనులు ఎన్నో చేశానని చెప్పిన బ్రహ్మానందం... ప్రూఫ్ లు ఏవి అంటే మాత్రం చెప్పలేను ఎందుకంటే నేను ఫోటోలు తీయించుకొలేదు అది నా తప్పే అంటూ  బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఒకవేళ సోనూ సూద్  సూర్యుడు అయితే తాను చిన్న మిణుగురు  పురుగు  లాంటి వాడినని..  ఎవరి కాంతి వారికి ఉంటుంది అంటూ బ్రహ్మానందం కామెంట్ చేశాడు.  తాను  డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాను అంటూ చాలా మంది అంటుంటారు. అవును నిజంగానే డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉంటాను లేకపోతే ఎవరో ఒకరు సహాయం చేస్తారని  వెతుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: