"జురాసిక్ వరల్డ్ పార్ట్ 3" రిలీజ్ డేట్ ఫిక్స్!
ముఖ్యం వీరి సినిమాలలో గ్రాఫిక్స్ పార్ట్ అంటేనే అమేజింగ్. థియేటర్ లో చూస్తుంటే మన ముందు జరుగుతున్నట్టు గానే ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాలను మనము చూసాము. వాటిని విజయవంతం చేసాము. ఇప్పుడు మనముందుకు మరో సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. అదేమిటంటే "జురాసిక్ వరల్డ్ పార్ట్ త్రీ" , ఇది డైనోసార్ ఇతివృత్తంగా తెరకెక్కించే సినిమా.ఇందులో బ్రైస్ డల్లాస్ హోవార్డ్, క్రిస్ ప్రాట్, జెఫ్ గోల్డ్ బ్లమ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. కోలిన్ ట్రెవరావ్ దీనికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగి ఉంటే ఇప్పటికే ఇది విడుదల కావాల్సింది. కానీ కరోనా వలన జరుగుతున్న షూటింగ్ ఆగిపోయి ఆలస్యం అయిపోయింది.
అయితే రీసెంటుగా ఇంగ్లాండ్ లో దీని షూటింగ్ తిరిగి మొదలైనట్లు సమాచారం. షూటింగ్ పార్ట్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే సంవత్సరం 11 జూన్ 2021 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి ముందు వచ్చిన జురాసిక్ రిలేటెడ్ మూవీస్ అన్నీ కూడా ప్రేక్షకులని బాగా రంజింపచేశాయి. అదే దారిలో ఇది కూడా ఘనవిజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ అంతా అనుకుంటున్నారు. మరి మనము కూడా ఈ సినిమా వారు అనుకున్న సమయానికి విడుదలయ్యి చిత్ర యూనిట్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం.