రాబోయే మన తెలుగు సినిమాల షూటింగులు ఎంతవరకు అయిపోయాయో చూడండి.. !!!

frame రాబోయే మన తెలుగు సినిమాల షూటింగులు ఎంతవరకు అయిపోయాయో చూడండి.. !!!

Purushottham Vinay
కరోనా కారణంగా ఇప్పటికే రావాల్సిన షూటింగులు వాయిదాపడ్డాయి. కరోనా లేకపోతే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ సినిమాలతో కళకళలాడుతూ ఉండేది. ఇక సినిమాలు షూటింగులు ఎంతవరకు అయిపోయాయో ఇండియా హెరాల్డ్. కామ్ అందిస్తున్న ఈ న్యూస్ మీకోసం చూడండి.. !!

ప్రస్తుతం కరోనా ప్రభావం వలన పరిస్థితులు కూడ చాలా దారుణంగా వున్న మొన్న ఈ మధ్య షూటింగ్ స్టార్ట్ చేయాలనుకున్న  ట్రిపుల్ ఆర్ సినిమా కి గట్టి దెబ్బ తగిలింది .. ఆ టైమ్ లో రాజ మౌళి కి ఆయన కుటుంబ సభ్యులకి కరోనా రావటం తో షూటింగ్ కి బాగా బ్రేక్ ఇచ్చారు. ఇకపోతే ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా 75 శాతం  పూర్తి అయిపోయింది.

ఇంకా 25 శాతం  మిగిలి వుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య  సినిమా షూటింగ్ ఇంకా 60 శాతం వుంది. నాని నటిస్తున్న టక్ జగదీష్ సినిమా షూటింగ్ కూడ ఇంకా 60 శాతం వుంది. నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ 50 శాతం  వుంది. అలాగే నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న సినిమా రంగ్ దే 60 శాతం పూర్తి చేసుకుంది. ఇక ప్రభాస్ పూజ హెగ్డే రాధే శ్యాం షూటింగ్ 30 శాతం  వుంది. వెంకటేష్ సినిమా నారప్ప షూటింగ్ కూడ ఇంకా 30 శాతం  వుంది.అఖిల్, పూజ హెగ్దే నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ కి ఇంకా 25 శాతం షూటింగ్ ఉండగా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కి కూడ ఇంకా 25 శాతం  షూటింగ్ వుంది. ఇంకా శ్రీకారం చిత్రాని కి 20 శాతం, మాస్ మహారాజా రవితేజ  క్రాక్, రానా విరాటపర్వం, పూరి తనయుడు ఆకాష్ పూరి రొమాంటిక్, సందీప్ కిషన్, లావణ్య ఏ 1ఎక్సప్రెస్, నాగ చైతన్య, సాయి పల్లవి ల  లవ్ స్టోరీ చితాలకు 10 శాతాల షూటింగులు పెండింగ్ దశలో వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: