నయనతారకు మరో ఛాలెంజ్ ఇస్తున్న భర్త విగ్నేష్ శివన్...గెలుస్తుందా ?
ఈమె నటనకు ఫిదా అయిన తమిళ ప్రేక్షకులు నయనతారను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు. కోలీవుడ్లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇటు తెలుగులోనూ సూపర్ స్టార్ గా పేరుగాంచింది నయనతార. చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నయన. ఇక అప్పటినుండి విభిన్న పాత్రలతో వీక్షకుల మెప్పును పొందారు. అటు అందాల ఆరబోతలోనూ, ఇటు సంస్కృతికి అద్దం పట్టే పాత్రలోనూ కనిపిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ గొప్ప నటిగా ముద్ర వేసుకొని స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో టాప్ ప్లేస్ కి చేరారు లేడీ సూపర్ స్టార్. ఇప్పుడు మరో చాలెంజ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు నయన, తను నటించబోయే నెక్స్ట్ మూవీ లో అంధురాలు గా కనిపించబోతున్నారని సమాచారం.
తన భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న "కథవకుల్ రెండు కాదల్" అనే చిత్రంలో అంధురాలిగా నటించబోతున్నారట. ఇంతకుముందు వినికిడిలోపంతో ఉన్న అమ్మాయి పాత్రను పోషించి ప్రేక్షకుల మెప్పును పొందిన నయనతారకు ఇదేం కొత్తకాదు, అవలీలగా ఈ పాత్రలో కూడా జీవించి తన సత్తా మరోసారి చాటుకుంటారు అంటున్నారు నయన ఫ్యాన్స్. మరి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయి నయన అకౌంట్లో లో మరో హిట్ పడాలని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.