మహేష్ బాబు చెప్పిన ఆ గొప్ప మాటను ఎప్పటికీ మర్చిపోలేను : సమంత అక్కినేని

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదట రాజకుమారుడు సినిమా తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్, ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుని, వాటిని మంచి సక్సెస్ లు గా మలచుకుని కోట్లాదిమంది అభిమానులను, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలను, క్రేజ్ ని గడించారు. తండ్రి కృష్ణ నటవారసుడిగా ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్ బాబు నేటితరం యువ నటులకు ఎందరికో ఆదర్శం అని అంటారు సినీ విశ్లేషకులు.  

హీరోగా ఉన్నత స్థాయి లో ఉన్నప్పటికీ కూడా ఎంతో ఒదిగి ఉండే మహేష్, పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ రియల్ హీరో అని అనిపించుకుంటున్నారు. అయితే మహేష్ తో కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్ సమంత అక్కినేని. మొదట మహేష్ తో కలిసి ఆమె నటించిన దూకుడు సినిమా అతి పెద్ద సంచలన విజయాన్ని అందుకుని హీరోయిన్ గా సమంతకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా సక్సెస్ కొట్టినప్పటికీ, మూడవసారి వీరి కాంబోలో వచ్చిన బ్రహ్మోత్సవం మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  

అయితే తాను ఎప్పుడు మహేష్ బాబు ను కలిసినా మొదట్లో ఆయన చెప్పిన ఒక మాట మాత్రం తనకు ఎప్పటికీ గుర్తుకు వస్తుందని చెప్తుంటారు సమంత. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో ఒకసారి మహేష్ తో మాట్లాడినపుడు, మనం ప్రతి సినిమాని తొలి సినిమాగా ఫీల్ అయి వర్క్ చేస్తే వెంటనే కాకపోయినా రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం మన వెంట వస్తుంది అని చెప్పిన మాటని మాత్రం తాను ఎప్పుడూ మరువలేనని, అలానే తాను ఎప్పుడూ అదే మాటని అనుసరిస్తుంటానని పలు సందర్భాల్లో చెప్పారు సమంత అక్కినేని .....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: