యాంకర్ మంజూష.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవరం లేదు. నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంజూష. అయితే దాదాపుగా పదేళ్ల నుండి ఇండస్ట్రీలో కెరీర్ సాగిస్తున్న ఈ భామకి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలుగా కనిపించిన తరువాత మరో సినిమాసైన్ చేయలేదు.
కానీ, వెండితెరపై కంటే ఈ అమ్మడుకు బుల్లితెరపై బాగా కలిసొచ్చిందని చెప్పాలి. సినిమా ఆఫర్లు లేకపోవడంతో మంజూష యాంకర్ గా బిజీ అయ్యింది. అలాగే స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా పలు రియాలిటీ షోలకు కూడా యాంకరింగ్ చేస్తోంది.
ఇక చక్కటి చిరునవ్వుతో అందమైన మోముతో బుల్లితెర మీద సందడి చేసే యాంకర్ మంజూష అంటే యూత్, మహిళల్లో చాలా మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. యాంకరింగ్ తో మాత్రమే కాదు..గ్లామర్ తో కూడా మంజూష ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంజూష తరచుగా ఫొటో షూట్స్ చేస్తూ.. హాట్ షోతో హీటెక్కిస్తోంది. విభిన్నమైన ట్రెండీ దుస్తులు, శారీలుక్ లో యూత్‌కు మంచి కిక్ ఇస్తుంటుంది. తాజాగా కూడా మంజూష హాట్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.