పవన్ , అల్లు అర్జున్ బదులుగా ఆ క్రికెటర్లు ..... వైరల్ అవుతున్న ఫోటోలు .....!!

GVK Writings
టాలీవుడ్ నేటి తరం స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికీ ఎంతో గొప్ప క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అలవైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీలో హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రెండున్నరేళ్ల తరువాత ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్, అతి త్వరలో వాటిని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.  
ఇక ఇటీవల లాక్ డౌన్ కారణంగా మన దేశంలోని వారందరూ కూడా పూర్తిగా ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తూ తమ అభిమానులను ఉత్సాహపరిచారు. మరోవైపు పలువురు క్రికెటర్లు కూడా తమ లాక్ డౌన్ సమయాన్ని టిక్ టాక్ వీడియోలు వంటివి చేస్తూ సందడి చేసారు. అయితే వారిలో ఎక్కువగా పాపులరైంది మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ అనే చెప్పాలి. ఇటీవల తన భార్య, కూతురు తో కలిసి పలు సాంగ్స్ టిక్ టాక్ వీడియోలు చేసిన వార్నర్, మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.  
అయితే అతి త్వరలో దుబాయ్ వేదికగా ఐపీఎల్ తాజా సీజన్ మొదలు కానున్న సందర్భంగా, నేడు పలువురు అల్లు అర్జున్ అభిమానులు అలవైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ కోడిని పట్టుకుని ఉన్న పోస్టర్ ను ఎడిట్ చేసి ఆయన ప్లేస్ లో వార్నర్ ఫోటో అమర్చి 'అల దుబాయ్ లో' అంటూ టైటిల్ పెట్టి దానిని సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేసారు. అలానే పవన్ అభిమానులు అత్తారింటికి దారేదిలోని పవన్ కళ్యాణ్ పోస్టర్ ని ఎడిట్ చేసి ఆయన ప్లేస్ లో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియంసన్ ఫోటోని అమర్చి 'దుబాయ్ కి దారేది' అంటూ టైటిల్ పెట్టి దానిని అప్ లోడ్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటోలు రెండూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ సరదా ఫోటోల పై ఒక లుక్ వేయండి మరి ....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: