నిర్మాత ఋణం తీర్చుకుంటున్న చిరంజీవి దర్శకులలో పెరిగిపోతున్న కన్ఫ్యూజన్ !
ఈమూవీ తరువాత చిరంజీవి నటించాలని ముచ్చట పడుతున్న ‘లూసీఫర్’ పరిస్థితి ఏమిటో ఆ మూవీకి ఇప్పటికే స్క్రిప్ట్ తయారు చేసిన సుజిత్ కు కూడ క్లారిటీ లేదు. ఈమధ్యలో బాబి ఒక కథ తయారుచేసి చిరంజీవికి వినిపించడం ఆ కథకు చిరంజీవి ఓకె చేయడం జరిగిపోయింది అన్నప్రచారం జరుగుతోంది. ఈవార్తలు ఇలా ఉండగా ఇప్పుడు తెరపైకి వచ్చిన చిరంజీవి మెహర్ రమేశ్ ల మూవీ ప్రాజెక్ట్ మరింత ఆశ్చర్యాన్ని ఇస్తోంది.
తమిళ సినిమా వేదాళం’ రీమేక్ గా చేయబోయే ఈ మూవీ కథలో చాల మార్పులు మెహర్ రమేశ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీని చిరంజీవి కెఎస్ రామారావు నిర్మాణంలోని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు టాక్. చిరంజీవి కెఎస్ రామారావుల కాంబినేషన్ లో అనేక సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాతగా కె ఎస్ రామారావు పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ నిర్మాతకు తిరిగి బ్రేక్ ఇవ్వడానికి చిరంజీవి మెహర్ రమేశ్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు టాక్.
వాస్తవానికి రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ఎప్పటి నుండో కె ఎస్ రామారావు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు చరణ్ కాకుండా ఏకంగా చిరంజీవి రంగంలోకి దిగి కెఎస్ రామారావు పట్ల తన ఋణం తీర్చుకుంటున్నాడు అని అనుకోవాలి. చిరంజీవి ఉద్దేశ్యం మంచిదే అయినా ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు చిరంజీవి 65 సంవత్సరాల వయసును పరిగణంలోకి తీసుకుంటే ఇన్ని సినిమాలు చిరంజీవి ఎలా పూర్తి చేస్తాడు అంటూ చిరంజీవికి కథలు చెప్పి నమ్మకం పెట్టుకున్న దర్శకులు కన్ఫ్యూజన్ లో ఉన్నారు..