అజిత్ కుమార్.. మెకానిక్ టు అల్టిమేట్ స్టార్!

Purushottham Vinay
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కి  మన తెలుగు రాష్ట్రాలలో పెద్దగా క్రేజ్ లేకపోచ్చు. కానీ తమిళ్ లో ఆయనకు వున్న స్టార్డామ్ గురించి తెలిస్తే వావ్ అంటారు.ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం.

బాగా కష్టపడి స్వయం కృషి తో పైకొచ్చిన నటులు అంటే చాలా మంది రజినీకాంత్, చిరంజీవి, రవితేజ ల గురించి చెబుతారు. కానీ అజిత్ ఎంత కష్టపడి పైకి వచ్చాడో తెలిస్తే నిజంగా గ్రేట్ అంటారు. తమిళ్ లో ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా తల అని పిలుచుకుంటారు. అజిత్ పుట్టింది సికింద్రాబాద్ లో, పెరిగింది చెన్నై లో. ఒక నిరుపేద కుటుంబం లో అజిత్ జన్మించారు. సినిమాల్లోకి రాకముందు అజిత్ చెన్నై లోని అంబత్తూర్ ఏరియా లో ఒక మెకానిక్ గా పని చేసేవాడు. సినిమాల మీద ప్రేమతో ఎలాగోలా కష్టపడి చిన్న సినిమాలలో నటించాడు.అలా తన నటనతో, కృషి తో గొప్ప నటుడిగా ఎదిగి తమిళనాట కోట్లాదిమంది అభిమానులని సొంతం చేసుకున్నాడు అజిత్. ఎంతలా అంటే ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానులు పిచ్చెక్కిపోతారు. అంతటి స్టార్డామ్ వుంది తల అజిత్ కుమార్ కి.

ఆయన సినిమా కెరీర్ స్టార్టింగ్ లో ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే అప్పట్లో అజిత్, సహా నటుడు ప్రశాంత్ కి ఒక ఈవెంట్ కి రమ్మని ఆహ్వానం వచ్చింది. ఆ ఈవెంట్ లో వాళ్ళు అజిత్ ని పట్టించుకోకుండా పక్కన పెట్టి ప్రశాంత్ కి దండ వేసి అభినందించారు. ఎందుకంటే ప్రశాంత్ అప్పుడు స్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరో కాబట్టి. కానీ ఇప్పుడు అజిత్ క్రేజ్ చూస్తే పీక్స్ లో వుంది. అజిత్ స్టార్టింగ్ లో యస్ జె సూర్య దర్శకత్వం లో వాలి అనే సినిమా చేశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత యస్ జె సూర్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఏ ఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా దీన లో అజిత్ హీరో గా చేశారు. అంతే ఈ సినిమా ఎంతటి ఘన విజయం  సాదించింది అంటే ఆ సినిమా తర్వాత అజిత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక. ఒక్కసారిగా టాప్ హీరో అయిపోయాడు. ఇప్పుడు తమిళ్ లో ఆయన క్రేజ్ చూస్తే మతిపోతుంది.తమిళ్ లో టాప్ హీరో గా కొనసాగుతున్నాడు.  

ఇక రీసెంట్ గా అజిత్ పింక్ రీమేక్ నేర్వకొండ పార్వై తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఖాకి ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వం లో వలిమై అనే ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలకు బోనీ కపూర్ నిర్మాత. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: