మామయ్యనే ఫాలో అవుతున్న సుధీర్ బాబు !

NAGARJUNA NAKKA
సుధీర్ బాబు మామయ్యనే ఫాలో అవుతున్నాడు. ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనిపించుకున్న కృష్ణ రూట్ లోనే ప్రయాణిస్తున్నాడు సుధీర్. సూపర్ స్టార్ ఇన్ స్పిరేషన్ తో కొత్తకొత్త స్టెప్పులేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి సుధీర్ బాబు కూడా కృష్ణ లాగా ప్రయోగాలు చేయబోతున్నాడా.. టెక్నికల్ గా ట్రెండ్ సెట్ చేయబోతున్నాడా అంటే ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.


సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. బిజినెస్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి సుధీర్ బాబు ఫుల్ టైమ్ ఇండస్ట్రీకి డెడికేట్ అయ్యాడు. మరో బిజినెస్ గురించి ఆలోచించకుండా సినిమాలతోనే ప్రయాణిస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ సొంతంగా స్టూడియో కట్టబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.


సుధీర్ బాబు ఇప్పటికే నిర్మాణ రంగంలో ఉన్నాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్ పేరుతో ఒక సినిమా నిర్మించుకున్నాడు. నన్నుదోచుకుందువటే.. మూవీతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడీ హీరో స్టూడియో అధినేతగా మారుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. మామయ్య కృష్ణ పద్మాలయ స్టూడియో కట్టినట్టే అల్లుడు కూడా ఒక స్టూడియో కట్టబోతున్నాడనే టాక్ వస్తోంది.


సుధీర్ బాబు స్టూడియో కట్టడానికి సరైన ప్లేస్ కోసం వెతుకుతున్నాడని చెప్పుకుంటున్నారు. మరి ఆ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుందా.. లేక తెలంగాణలో దొరుకుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చాలామంది నిర్మాతలు విశాఖపట్నంలో స్టూడియో కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మరి సుధీర్ బాబు ఎక్కడ స్టూడియో కడతాడు అనేది చూడాలి. మొత్తానికి సుధీర్ మామయ్య రూట్ లోనే ప్రయత్నిస్తున్నారు. స్టూడియో అధినేతగా మారబోతున్నాడు. అందులో భాగంగానే స్థలం వెతికే పనిలో బిజీ అయిపోయాడు. సుధీర్ బాబు ప్రొడక్షన్ తో సుధీర్ నిర్మాతగా మారిపోయాడు. నానితో కలిసి వి సినిమాలో నటించిన సుధీర్ బాబు నిర్మాతగా తన కొత్త రూట్ ను ఎంచుకుంటున్నాడు. చూద్దాం.. సుధీర్ బాబు ప్రొడ్యూసర్ గా ఎలా రాణిస్తాడో..












మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: