వంద మిలియన్ వ్యూస్ రాబట్టిన అఖిల్ చిత్రం..!

Suma Kallamadi
అక్కినేని అఖిల్ ఇప్పటికే పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా హిట్లు అందుకో లేదు. కానీ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది మిస్టర్ మజ్ను హిందీ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ చిత్రంకి. ఈ సిసింద్రీ మనం, అఖిల్ , హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల్లో నటించాడు . కానీ అనుకున్నంత స్థాయికి చేరుకోలేక పోయాడు. అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ న‌టించి మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రం హిందీ లో దుమ్ము లేపింది.





మిస్టర్ మజ్ను హిందీ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ చిత్రం కి ఇప్పుడు అక్కడ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. మన  టాలీవుడ్  ఈ చిత్రం అంత‌గా అల‌రించ‌క ‌పోయిన‌ప్ప‌టికీ హిందీ ప్రేక్ష‌కుల‌ని ఈ చిత్రం బాగానే ఆక‌ట్టుకుంది. అయితే కొద్దీ రోజుల క్రితమే ఈ చిత్రాన్ని హిందీలో డ‌బ్ చేసి యూ ట్యూబ్ ‌లో విడుద‌ల చేశారు.  ఈ హిందీ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ చిత్రానికి వంద మిలియ‌న్ రావడం మామూలు విషయం కాదు . నిజంగా దుమ్ము లేపింది మిస్టర్ మజ్ను హిందీ వర్షన్ .





అలానే హీరో నితిన్ నటించిన  అ..ఆ , అ ఆ 2 (ఛ‌ల్ మోహ‌న్ రంగ హిందీ వెర్ష‌న్) , శ్రీనివాస క‌ళ్యాణం సినిమాలు కూడా హిందీ లో మంచి ఆద‌ర‌ణ వచ్చింది. ఇలా తెలుగు లో ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలు అక్కడ  దుమ్ము  లేపుతున్నాయి. అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను  చిత్రాన్ని వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించారు.  నిధి అగ‌ర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా  న‌టించింది . రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి రూపొందించారు. హిందీ డ‌బ్బింగ్ వ‌ర్షెన్ చిత్రానికి వంద మిలియ‌న్ రావడం చాలా గొప్ప విషయమే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: