నాగబాబు దృష్టిలో విశ్వాసం లేని కుక్క ఎవరు?

Deekshitha Reddy
సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చడంలో నాగబాబు దిట్ట. ఆమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన మెగా బ్రదర్ వరుసగా ఇలాంటి సెటైరికల్ వీడియోలే విడుదల చేసి సంచలనాలు సృష్టించారు. కరోనా టైమ్ లో సినిమా షూటింగ్ లకోసం కేసీఆర్ ని చిరంజీవి టీమ్ కలవడంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తన యూట్యూబ్ వీడియోల ద్వారానే కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగిందనుకోండి. ఇప్పుడు మళ్లీ నాగబాబు మరో ఫన్నీ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఆ వీడియోకి ఆయన పెట్టిన టైటిల్, దాని వెనకున్న మీనింగ్ మాత్రం ఎవరినో నాగబాబు టార్గెట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది.

వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నాగబాబు ఆవేశంగా బైటకొస్తారని అభిమానులు ఆశపడ్డారు. వపన్ కల్యాణ్ కి మద్దతుగా మాట్లాడతారని, వీలైతే వర్మకు వార్నింగ్ ఇస్తారని అనుకున్నారు. కానీ నాగబాబు ఆ విషయంలో ఎందుకో పూర్తిగా సైలెంట్ అయ్యారు. సినిమా విడుదలకు ముందు కానీ, తర్వాత కానీ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. రాగా పోగా రామ్ చరణ్ మాత్రం విశ్వసనీయ సమాచారమే వినండి అనే అర్థమొచ్చేలా రంగస్థలంలో ఓ స్టిల్ విడుదల చేసి కాస్త కలకలం రేపారు. అప్పుడు సైలెంట్ గా ఉన్న నాగబాబు ఇప్పుడు విశ్వాసం లేని కుక్క అంటూ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఇంతకి నాగబాబు చెబుతున్న విశ్వాసం లేని కుక్క ఎవరు. ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. అమరావతి రాజధాని వ్యవహారంలో ఒకరిపై ఒకరు బురదజల్లుకుంటున్నారు. మీరు రాజీనామాలు చేయండి అంటే మీరు చేయండి అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాగబాబు కూడా ఈ విషయంపై జనసేన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు, తన వాణి వినిపించారు. దీంతో నాగబాబు ఎవరినో పొలిటికల్ గా టార్గెట్ చేసుకున్నారని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. ఎన్నో ఏళ్లుగా తనకు విశ్వాసంగా ఉన్న కుక్క, అవసరం వచ్చినప్పుడు తన నిజస్వరూపం చూపించిందని ఆ వీడియోలో నాగబాబు సెటైర్ వేశారు. అలా ఎవరైనా నాగబాబుని కానీ, పవన్ కల్యాణ్ ని కానీ వదిలేసి వెళ్లిపోయారా, విశ్వాసం చూపించలేదా, అలా విశ్వాసం చూపించకుండా వెళ్లిపోయిన వారినే నాగబాబు టార్గెట్ చేశారా? ఏమో మెగా బ్రదర్ మనసులో ఏముందో ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: