కెమెరా ముందుకొచ్చిన నాగార్జున..!

shami
బిగ్ బాస్ సీఎజన్ 4 కు సంబందించిన షూటింగ్ మొదలైంది. ప్రోమో షూటింగ్ లో హోస్ట్ గా చేస్తున్న కింగ్ నాగార్జున పాల్గొన్నారు. సీజన్ 3కి కూడా ఆయన హోస్ట్ గా చేశారు. ప్రస్తుతం కరోనా టైం లో స్టార్ హీరోల్లో కెమెరా ముందుకు వచ్చిన ఏకైక స్టార్ నాగార్జున అని చెప్పొచ్చు. సీజన్ 3లో ఆయన హుశారైన వ్యాఖ్యానంతో ప్రేక్షకులను మెప్పించింది. మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వాతా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నాగ్ ఆ తర్వాత ఎం.ఈ.కే 2లో కూడా మెప్పించారు. తను చేసే ఏ షో అయినా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టే నాగ్ దానికి తగిన ఫలితాన్ని పొందుతారు.

ఇక లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 కోసం ప్రోమో షూట్ లో పాల్గొన్నారు నాగార్జున. 3 సక్సెస్ ఫుల్ సీజన్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు నాల్గవ సీజన్ కు రెడీ అయ్యింది. 3వ సీజన్ హోస్ట్ గా చేసి సూపర్ హిట్ కొట్టిన నాగార్జున ఈ సీజన్ కు మరింత ఉత్సాహంగా హోస్ట్ గా రానున్నారు. ఇక ఈ సీజన్ కేవలం 50 రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. 15 మంది కంటెస్టంట్స్ పాల్గొనే ఈ సీజన్ లో ప్రతివారం రెండు ఎలిమినేషన్స్ ఉండే అవకాశం ఉందట. అంతేకాదు ప్రతి సీజన్ లో ఉండే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ సీజన్ లో ఉండవని. హౌజ్ లోకి 15 మంది కంటెస్టంట్స్ తప్ప మరెవరు హౌజ్ లోకివెళ్ళరని అంటున్నారు.

ఇక 15 సెలబ్రిటీ కంటెస్టంట్స్ కూడా షో స్టార్ట్ అయినప్పుడ్ సర్ ప్రైజ్ చేస్తారని. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న లిస్ట్ లో కొందరు మాత్రమే ఉన్నారని. మిగతా వారు మాత్రం షో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 4 మొదటి అడుగు పడ్డది త్వరలోనే ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు పండగే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: