రేణూ దేశాయ్: పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా....!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణూదేశాయ్ విడిపోయాక ఆమె పూణే వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. అయితే కొంత కాలంగా పూణే లోనే ఉంటున్న రేణూదేశాయ్ హైదరాబాద్ కి ప్రాజెక్టు పనుల మీద రావలసి వచ్చేది. అయితే ఆమె రైతు నేపథ్యంలో ఓ కథను తయారు చేసి ఆ పనిలోనే హైదరాబాద్ కి మకాం మార్చింది. ఈమె పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్నాక బుల్లి తెర పై ఒక షోకు జడ్జీగా కూడా వ్యవహరించింది. వెండి తెర పై కనిపించడం కొన్నేళ్లు అవుతోంది. ఇదిలా ఉండగా కామెడీ సీరియల్లో కూడా ఈమె నటించింది. అయితే సునయనాతో కలిసి చేస్తున్న ప్రోగ్రాం మాత్రం బాగా క్లిక్ అయ్యింది అని చెప్పాలి.
తాజాగా ఈ భామ ఒక ఫోటోలు షేర్ చేసింది. చేతిలో గన్ను పట్టుకున్నట్టుగా ఆమె ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. దీనితో ఒక నెటిజన్ ''వాగితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా '' అని కామెంట్ పెట్టారు దీనికి సమాధానం అవునన్నట్లుగా రేణూ దేశాయ్ నవ్వేసింది.