సోనూ సూద్ ఆస్తి ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు సోనూ సూద్. సినిమాల్లో విలన్ గా కనిపించిన ఇతను లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయారు. తిండి, ఆశ్రమం లేక రోడ్లమీద నానా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఇంటికి చేర్చేందుకు చొరవ తీసుకొని వాళ్ళకి దేవుడిలా మారారు సోనూ సూద్. ఈ విపత్కర సమయంలో ఆపదలో ఉన్న చాలా మంది ప్రజలకు అండగా నిలుస్తున్న సోనూ సూద్ గురించి అనేక కథనాలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయలు అమ్ముతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఉద్యోగం ఇప్పించడం, పొలంలో కొడుకుల సహాయం తో నాగలి దున్నేటి వ్యక్తికి ఉచితంగా టాక్టర్ ఇప్పించడం, ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు ఆహార పొట్లాలు అందించడం వంటివి ఎన్నో చేసి ఎంతోమంది సంతోషానికి కారణం అయ్యారు సోనూసూద్. అయితే దాదాపు మూడు నెలల పాటు దానధర్మాలు నిర్విరామంగా చేస్తున్న సోనూసూద్ కి ఏమైనా ఆస్తి ఉందా అని చాలామంది తెగ చర్చించుకుంటున్నారు.
సోనూ సూద్ గత 15 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ విలన్ గా దూసుకెళ్తున్నారు. భారతదేశంలో మూడు భాష సినిమాల్లో విలన్ గా నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించిన సోనూ సూద్ తన క్రేజ్ కి తగ్గట్టుగానే పారితోషికాన్ని పుచ్చుకుంటారు. సినిమాల్లో ఆదాయం సంపాదించడం తో పాటు అతనికి ఒక పెద్ద హోటల్ బిజినెస్ కూడా ఉంది. దీనికితోడు వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా చాలా ఉంది. ఇవన్నీ కలిపితే ఎంత లేదనుకున్నా సోనూసూద్ కి 150 కోట్ల రూపాయల ఆస్తి ఉందని బాలీవుడ్ మీడియా వర్గాలు ఒక అంచనా వేస్తున్నాయి.
నిజానికి భారతదేశంలో సోనూ సూద్ కంటే ఎక్కువ సంపద ఉన్నా నటీనటులు ఎంతమందో ఉన్నారు. కానీ ఎంత ఆస్తి ఉన్నా దానం చేయగల గొప్ప మనసు మాత్రం ఒక్క సోనూ సూద్ కే ఉందని స్పష్టమౌతుంది. ఈ వారాంతంలో కపిల్ శర్మ షో లో సోనూ సూద్ గెస్ట్ గా రాగా... అతనితో వీడియోను కాల్ ద్వారా వలస కార్మికులు మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ల సంతోషాన్ని చూసిన సోనూ సూద్ బాగా భావోద్వేగానికి గురయ్యారు.