విదేశీ అందగాళ్లతో మన ముద్దుగుమ్మల పెళ్లిళ్లు..!

NAGARJUNA NAKKA

హీరోయిన్ ప్రేమలో పడితే. ఎవరని అడగడం మానేసి.. ఏ దేశం కుర్రాడని అడిగే పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. చాలా మంది ముద్దుగుమ్మలు ఫారినర్స్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆల్ రెడీ ఇద్దరు పళ్లి కూడా చేసుకుంటే.. కొందరు బ్రేకప్ చెప్పేశారు. 

 

బెంగాలీ మూలాలున్న రిచా గంగోపాధ్యాయ ఫ్యామిలీ అమెరికాలో స్థిరపడింది. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన రిచా మిరపకాయ్.. మిర్చి సినిమాతో సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురవడం... ఛాన్సులు లేక చదువు కోవడానికి అమెరికా వెళ్లిపోయింది. బిజినెస్ స్కూల్లో పరిచయమైన జోతో ప్రేమలో పడింది. రెండేళ్లుగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 

 

గోవా బ్యూటీ ఇలియానా ప్రేమలో నాలుగేళ్లు దాటింది. ఆ మధ్య పెళ్లయిపోయిందన్న వార్త కూడా హల్ చల్ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూస్ ప్రేమలో పడిన ఇల్లీ. సోషల్ మీడియాలో ఫోటోలు పెడతూ ప్రేమను చాటుకుంది. అయితే ఈ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఇలియానా. ఆ మధ్యనే మళ్లీ కోలుకొని.. సన్నబడింది. 

 

ఇలియానా కంటే ముందే ఫారిన్ లవర్ కు బ్రేకప్ చెప్పేసింది. ఒకానొక టైమ్ లో సినిమాల గురించి పట్టించుకోకుండా. లండన్ యాక్టర్ మైఖేల్ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ మధ్య ఓ పెళ్లికి కమల్ తో పాటు.. మైఖేల్ ను వెంటేసుకొని వచ్చి పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెప్పకనే చెప్పింది. అయితే ఆ బ్లెస్సింగ్స్ ఏవీ పనిచేయలేదు. మనస్పర్థలతో మైఖేల్ కు బ్రేకప్ చెప్పేసి మళ్లీ సినిమాలో బిజీ అయిపోయింది. 

 

మన ముద్దుగుమ్మలు ఫారిన్ అబ్బాయిల ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. కెరీర్ స్టార్ట్ చేసి 15ఏళ్లు అయినా.. ప్రేమ.. దోమకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రియ.. ఎప్పుడు లవ్ లో పడిందో ఏమో గానీ రష్యా కుర్రాడితో ఏడడుగులు నడిచింది. 


సినిమా వాళ్ల ప్రేమకు దేశంతోనే కాదు.. ఏజ్ తో సంబంధం లేదు. తన కంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను ప్రియాంకా చోప్రా తన జీవితంలోకి ఆహ్వానించింది. ఈ ఇద్దరి పెళ్లి ఆ మధ్య వైభవంగా జరిగింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: