పవన్ - సుకుమార్ కాంబినేషన్ సెట్ చేస్తున్న ఆ ప్రొడ్యూసర్ ....??
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం, కోర్ట్ డ్రామా మూవీ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ వంటి సినిమాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నివేత థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు మరోవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
అలానే వీటితో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు పవన్, ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ మూడు సినిమాల తరువాత పవన్ తో సినిమా చేయాలని ఇప్పటికే పలువురు దర్శకులు ఆయన ఇంటికి వచ్చి కథలు వినిపించడం చేస్తున్నారట. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, టాలీవుడ్ కి చెందిన ఒక బడా ప్రొడ్యూసర్ అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో ఒక సినిమా తీసేందుకు సిద్దమవుతున్నట్లు చెప్తున్నారు.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప మూవీ తీస్తున్న సుకుమార్ ని ఇప్పటికే ఒక మంచి స్టోరీ సిద్ధం చేయమని చెప్పిన సదరు నిర్మాత, అతి త్వరలో అది పూర్తి కాగానే, దానికి పవన్ కు విపించి ఒప్పించాలని చూస్తున్నారట. అలానే సుకుమార్ కూడా తన స్టైల్ లో సాగుతూ, పవన్ ఇమేజ్ కి సరిపోయే విధంగా ఒక అద్భుతమైన స్టోరీ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు టాక్. అన్నీ కలిసి వస్తే ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సమాచారం. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది.....!!