గోపి చంద్ తో రాజీపడుతున్న మారుతి !
డైరక్టర్ మారుతి కి టాప్ హీరోలతో సినిమాలు చేయాలి అన్నది ఒక భారీ గోల్. ‘ప్రతిరోజూ పండగే’ సినిమా లాంటి సూపర్ హిట్ తరువాత కూడ మారుతి పరిస్థితిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. కరోనా పరిస్థితుల ముందు టాప్ హీరోలు ఎవరి ఖాళీగా లేకపోవడంతో మారుతి చెప్పే కధలు వినడానికి హీరోలు ఆశక్తి కనపరచలేదు.
ఆతరువాత షూటింగ్ లు ఆగిపోయి హీరోలు ఖాళీగా రోజులు గడుపుతున్న ప్రస్తుత పరిస్థితులలోకూడ మారుతి చెప్పే కథల వైపు ఏహీరో ఆసక్తి కనపరచకపోవడం సమాధానం లేని ప్రశ్న. దీనికితోడు టాప్ హీరోల కోసం ఆరు నెలలు ఏడాది ఖాళీగా వెయిట్ చేయడం అన్నది మారుతి కి అలవాటులేని పని. చేతిలో మూడు నాలుగు కధలు పెట్టుకుని ఆ కదలలో ఏ కథ ఏ హీరోకి నచ్చితే ఆహీరోతో వేగంగా సినిమా చేయడం మారుతి ఒక అలవాటుగా మార్చుకున్నాడు.
‘ప్రతి రోజూ పండగ’ తరువాత మారుతి రామ్ నాని రవితేజా లతో ఎవరో ఒకరితో సినిమా చేయాలని గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే ఆ ప్రయత్నాలు అన్ని ముందుకు సాగలేదు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం మారుతి గోపీ చంద్ తో సరిపెట్టుకోవలసి వస్తోంది అన్న లీకులు వస్తున్నాయి. యువి గీతా 2 సంస్థలు సంయుక్తంగా తీయబోతున్న సినిమాకు గోపీ చంద్ ను హీరోగా ఎంపిక చేసి ఆమూవీ దర్శకత్వ బాధ్యతను మారుతికి అప్పచెప్పినట్లు టాక్.
ప్రభాస్ కు గోపీ చంద్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యీ ఈమూవీ ప్రభాస్ ప్రోత్సాహంతో కార్యరూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మారుతి ఆలోచనలు అన్నీ పెద్ద హీరోల చుట్టూనే తిరుగుతూ ఉన్నా వారి డేట్స్ కోసం వెయిట్ చేస్తూ రోజులు గడిపెకన్నా ఇప్పటి పరిస్థితులలో గోపీ చంద్ తో సద్దుకునిపోయి తన కాంపౌండ్ లోకి వస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ప్రస్తుతం మారుతి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది..