ఆ ముగ్గురి సినిమాలకు అదరగొడుతున్నాడట ......??

GVK Writings

ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న సంగీత దర్శకుల్లో ఎస్. ఎస్. థమన్ ఒకరు. తెలుగులో రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన కిక్ మూవీతో కి అప్పట్లో అదరగొట్టే మ్యూజిక్ అందించిన థమన్, ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నాడు. దూకుడు, బృందావనం, ఆగడు, బిజినెస్ మ్యాన్, మిరపకాయ్, కందిరీగ, నాయక్, గ్రీకువీరుడు, రేస్ గుర్రం, పవర్, పండగ చేస్కో, సరైనోడు వంటి సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ పై అప్పట్లో కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనే ఒక ముద్ర పడింది. 

చాలారోజల పాటు తనపై అటువంటి విమర్శలు రావడంతో, ఎలాగైనా తన మ్యూజిక్ లో మరింత కొత్తదనం చూపించాలని నిర్ణయించిన థమన్, కొద్దిపాటి గ్యాప్ తీసుకుని, ఆ తరువాత శర్వానంద్ హీరోగా మారుతీ తెరకెక్కించిన మహానుభావుడు మూవీతో రీఎంట్రీ ఇచ్చారు థమన్. ఆ సినిమాకు అలరించే మ్యూజిక్ అందించిన థమన్, అక్కడి నుండి వరుసగా మంచి సక్సెస్ లతో దూసుకెళ్లాడు. ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అలవైకుంఠపురములో మూవీ కి అద్భుతమైన మ్యూజిక్ ని అందించిన థమన్, ఒక్కసారిగా ఆ సాంగ్స్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. 

ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్, అలానే అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. కాగా ఇప్పటికే వకీల్ సాబ్ కోసం అన్ని సాంగ్స్ సిద్ధం చేసిన థమన్, అతి త్వరలో ప్రారంభం కానున్న సర్కారు వారి పాట కోసం అప్పుడే మూడు సాంగ్స్ కంపోజ్ చేసాడట. అలానే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కోసం కూడా పలు అద్బుతమైన ట్యూన్స్ సిద్ధం చేస్తున్న థమన్, ఈ మూడు సినిమాలతో తన మ్యూజిక్ ప్రభంజనాన్ని చూపించడానికి సిద్డమవుతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ మూడు సినిమాలకు థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: