ప్రపోజ్ చేయగానే షాక్ అయింది... శ్రీమతి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రానా...?

Reddy P Rajasekhar

కొన్ని రోజుల క్రితం వరకు టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ లలో రానా ఒకరు. మరికొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న రానా కాబోయే భార్య మిహికా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే తాజాగా రానా మిహికా గురించి తన ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆగస్టు 8న రానా-మిహికాల వివాహం వీళ్ల పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రానా ఎన్నో సరికొత్త విషయాలను చెప్పారు. 
 
తాను, మిహికా ఒకే ప్రాంతంలో ఉండేవాళ్లమని... కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మిహికా ఇళ్లు ఉండేదని... కరోనా వల్ల తన వివాహం జరగడాని వింతైన సమయం దొరికిందని అన్నారు. తాను పెద్దవాడిని అయ్యానని.... పెళ్లి చేసుకోవాడానికి ఇదే మంచి సమయం అనిపించి మిహికాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని... జీవితంలో కొన్ని సార్లు అన్నీ సజావుగా సాగిపోతుంటాయని అన్నారు. 
 
మిహికా చాలా మంచిదని.... తమ జంట గొప్పగా నిలుస్తుందని... ఒకరినుంచి ఒకరం సానుకూల అంశాలను స్వీకరిస్తామని.... మిహికాతో వివాహం జరగడం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత ఉత్తమమైన సమయమని అన్నారు. వెంకటేష్‌ కుమార్తె ఆశ్రిత క్లాస్‌మెట్ అని ఎప్పటినుంచో తనతో పరిచయం ఉందని... మిహికా యస్‌ చెప్పడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు.              
 
మే నెల 12వ తేదీన మిహికాతో ఉన్న ఫోటోను షేర్‌ చేసి తన ప్రేమను ప్రపంచానికి తెలియజేశారు. మే 21న రోకా వేడుక జరిగింది. రానా మిహికాతో లైఫ్‌లాంగ్‌ సంతోషంగా ఉంటానని అర్థమైందని... తనకు లవ్ చేస్తున్నట్టు చెప్పడంతో తను మొదట షాక్‌ అయ్యిందని.. కానీ సంతోషంగా ఉందని అన్నారు. ముందు కొన్ని మంచి విషయాల గురించి తనతో చర్చించానని రానా చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: