వర్మ చెప్పిందే జరిగితే.. రాజమౌళి కి కష్టాలు తప్పవేమో..?

praveen
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన మాటలతో తన సినిమాలతో సంచలనం సృష్టిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తారో  అన్నది ఊహకందని విధంగా ఉంటుంది. అందుకే సినీ ప్రేక్షకులు అందరూ వర్మను వివాదాల దర్శకుడు అని పిలుచుకుంటారు. ఎందుకంటే వర్మ ఏం చేసినా అది వివాదంగా మారి పోతూ ఉంటుంది. అయితే ఇటీవలే దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలతో... భవిష్యత్తులో రాజమౌళి పరిస్థితి ఏంటి అనే  అనుమానాలు ప్రస్తుతం ఎంతో మంది సినీ ప్రేక్షకుల్లో వస్తున్నాయి. ఇంతకీ వర్మ ఏం మాట్లాడాడు అనే కదా మీ డౌట్... ఇటీవలే ఓ ఇంటర్వ్యూకి  హాజరైన రామ్ గోపాల్ వర్మ..



ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా మరో సంవత్సరం వరకు సినిమా  థియేటర్ లు  తెరుచుకునే అవకాశం లేదు అంటూ తెలిపాడు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు విడుదల కావాల్సిన సినిమాలన్నీ ఓటిటి లోనే విడుదల అవుతాయని... దీంతో సినీ ప్రేక్షకులు అందరూ సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడడం కంటే.. ఇంట్లో కూర్చొని ఓటిటి లో  సినిమా చూడడానికి ఎక్కువగా అలవాటు పడిపోతారు అంటూ రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. సంవత్సరం తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఆ తర్వాత ఓటిటి కి  అలవాటుపడ్డ సినీ ప్రేక్షకులు థియేటర్ లకి  వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని వర్మ వ్యాఖ్యానించాడు.



ఈ నేపథ్యంలో ఎంత పెట్టుబడి పెట్టిన ఎంతో  భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ 30 నుంచి 40 శాతం మాత్రమే వసూలు వస్తాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు వర్మ. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలు నిజమైతే రాజమౌళి పరిస్థితి ఏంటి అన్నది ప్రస్తుతం సినీ ప్రేక్షకుల మదిలో మెదులుతున్న ప్రశ్న. 400 కోట్ల భారీ బడ్జెట్ తో  ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్  అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపుగా 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాలి. అలా జరగలేదు అంటే నిర్మాతలకు నష్టాలు తప్పవు. మరి వర్మ  చెప్పిన విధంగా జరిగితే మాత్రం రాజమౌళికి భారీ షాక్ తగులుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: