
ఆహీరోయిన్ కోసం తూర్పు పడమర లుగా మారిన చిరంజీవి చరణ్ లు !
‘భరత్ అనే నేను’ విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోయినా కొరటాల శివ ఒక్క సినిమాను కూడ పూర్తి చేయలేకపోయాడు. కొరటాల చిరంజీవి కాంబినేషన్ లో మొదలైన ‘ఆచార్య’ మూవీకి గతసంవత్సరం ‘సైరా’ శత్రువుగా మారితే ఈసంవత్సరం కరోనా ఊహించని శత్రువుగా మారింది. దీనితో ‘ఆచార్య’ కు సంబంధించిన ప్లాన్ లో అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయి.
ఇప్పుడు ఈసినిమాను కనీసం వచ్చే ఏడాది సమ్మర్ రేసులో అయినా విడుదల చేయాలని ఈ మూవీ షూటింగ్ ను కనీసం సెప్టెంబర్ నుండైనా మొదలు పెట్టాలని కొరటాల శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర రూమర్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ఈమూవీలో ప్రత్యేక పాత్రను చేస్తున్న రామ్ చరణ్ కోసం ఇప్పుడు హీరోయిన్ వేట మొదలైంది.
ఇప్పుడు ఈ విషయమై చిరంజీవి చరణ్ ల మధ్య అభిప్రాయ భేదాలకు తావిచ్చింది అన్నలీకులు వస్తున్నాయి. ఈమూవీలో చరణ్ పక్కన హీరోయిన్ గా తమన్నా పేరును చిరంజీవి సూచిస్తూ ఉంటే చరణ్ మనసు మాత్రం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ పై ఉందని టాక్. ప్రస్తుతం మారిన పరిస్థితులలో జాన్వీ కపూర్ తన మనసును మార్చుకుని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
ఈవిషయాన్ని గ్రహించిన చరణ్ కొరటాల లు ప్రస్తుతం జాన్వీ తండ్రి బోనీకపూర్ తో రాయబారాలు చేస్తున్నట్లు టాక్. అయితే ‘ఆచార్య’ ప్రాజెక్ట్ లో జాన్వీ చేరిక వల్ల ఆమెకు ఇచ్చే భారీ పారితోషికంతో ఈమూవీ ప్రాజెక్ట్ కాష్ట్ మరింత పెరుగుతుందని చిరంజీవి అభిప్రాయపడుతుంటే జాన్వీ ఎంట్రీ వల్ల ‘ఆచార్య’ బిజినెస్ కు జాన్వీ క్రేజ్ కూడ బాగా కలిసివస్తుంది అని చరణ్ వాదన అని తెలుస్తోంది. దీనితో జాన్వీ వల్ల చరణ్ చిరంజీవిల మధ్య అనుకోని గ్యాప్ ఏర్పడే అవకాశం ఉందా అంటూ ఇండస్ట్రీ కొందరు ఈవిషయం ఫై కామెంట్స్ చేసుకుంటున్నారు..