పోలీసుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చెప్పిన బాలీవుడ్ సింగం..!
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ పోలీసు పాత్రలో కనిపించి భారీ హిట్ అందుకున్న సినిమా 'సింగం'. 2011లో విడుదలైన ఈ చిత్రం నేటితో 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. "9 వసంతాల సింగం. ప్రస్తుత పరిస్థితులను ధీటుగా ఎదుర్కొంటూ.. ప్రజలకు అండగా నిలబడుతున్న పోలీసుల ధైర్య సాహసాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది." అంటూ పేర్కొన్నాడు.
సింగం' చిత్రంలో అజయ్ సరసన కాజల్ అగర్వాల్ నటించింది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. 2010లో తమిళ్ హీరో సూర్య నటించిన సింగం చిత్రానికి ఇది రీమేక్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్గా 'సింగం రిటర్న్స్' పేరుతో 2014లో మరోసారి ప్రేక్షకులను అలరించాడు అజయ్.యముడు సినిమా పేరుతో తెలుగులో విలక్షణ నటుడు సూర్య నటించిన ఈ సినిమాను తెలుగు సినిమా ప్రజలు ఎంతగానో ఆదరించారు. ఇదే ఊపుతో సూర్య యముడు -2 అనే సినిమా కూడా సీక్వెల్ గా తెలుగు లోకి తీసుకొని వచ్చాడు. ఈ సినిమాలో కూడా పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటించి ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాడు.
మొదటి యముడు సినిమాలో సూర్య సరసన అనుష్క నటించింది, తర్వాత సీక్వెల్ లో అనుష్క తో పాటు హన్సిక నటించి సినిమా మరింత గ్లామర్ షో వచ్చేలా చేశారు... ఇదే అదునుగా చూసుకొని మూడోసారి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కించారు.. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లతో సినిమాను రూపుదిద్దారు.. అనుష్క తో పాటు శృతిహాసన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించి సూర్యతో స్టెప్పులు వేశారు. పోలీసు పాత్రలో అటు బాలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ, తమిళంలోనూ ఇద్దరు హీరోలు ప్రేక్షకులను మెప్పించారు. ఇద్దరు భారీ కలెక్షన్లు కూడా అదేవిధంగా కొల్లగొట్టారు.