పవన్ కళ్యాణ్ తో కలిసి నటించనున్న రవితేజ..?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు దర్శక, నిర్మాతలు. తమ సినిమాల్లో బడా తారాగణాన్ని నటింపజేస్తే ఏ సినిమా అయినా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని వారి నమ్మకం. ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ మూవీ లు తెలుగులో విడుదలై భారీ హిట్స్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినా పవన్ కళ్యాణ్ సినీ చరిత్రలో మొట్టమొదటి మల్టీస్టారర్ సినిమాగా నిలిచింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే రాధాకృష్ణ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష లో, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మరొక సినిమాలో పవన్ కళ్యాణ్ నటించేందుకు అంగీకరించాడు. వీటితో పాటు వేరే సినిమాల్లో కూడా నటించాలని పవన్ కళ్యాణ్ కథలను వింటున్నాడు. ఈ క్రమంలోనే అతడు రెండు కథలకు ఓకే చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో రానున్న ఒక తమిళ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని... అదే సినిమాలో రవితేజ కూడా ఒక కీలకమైన పాత్రలో నటించనున్నాడని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.
గత కొన్నేళ్లలో రవితేజ ఒక్క హిట్ కూడా అందుకోలేక తీవ్ర నిరాశలో ఉన్నాడని తెలుస్తుంది. అందుకే సోలోగా నటించి మళ్లీ మరొక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకునేందుకు రవితేజ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని సన్నిహిత వర్గాల నుండి టాక్. రవితేజ నిర్మాణ రంగంలో అడుగు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చిందని... అందుకు రవితేజ సానుకూలంగా స్పందించాడని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ సినిమాలో రవితేజ నిజంగా నటిస్తున్నాడో లేదో తెలియాలంటే కొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.