బాహుబలి సినిమా విజయం వెనుక ఇంతా కారణం ఉందా...?

Suma Kallamadi

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి సినిమా  సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాగా టర్న్ తీసుకొంది. బాహుబలి సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే హిట్ అందుకుంది. ఇప్పటి వరకు మన దేశంలోనే ఎక్కువ బాక్సాఫీస్ కలెక్షన్లు వసూళు చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం వల్ల  ప్రభాస్, రానా అయితే ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయారు. మొత్తంగా మాములు మహా భారత కథను పోలిని బాహుబలి సినిమా మన ఇండియన్ సినిమాలో ఒక చరిత్రగా మిగిలిపోయింది.

అంతేకాదు  ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు. సినిమాలో కనిపించే కాలకేయులు అనే తెగ ఈ భాష మాట్లాడుతుంది. ఒక సినిమా కోసం ఓ భాషను రూపొందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. అలాగే ఈ కిలికిరి బాషా కూడా ప్రజలను ఆకట్టుకుంది. బాహుబలి సిరీస్‌తో హీరోగా ప్రభాస్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. ఇక క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటన కూడా అమోఘం. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్లతో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. బాహుబలి ప్రియురాలిగా అనుష్క అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది.

ఇంకా కట్టప్ప పాత్ర అయితే ఒక సెన్సేషన్ సృష్టించింది. బాహుబలి 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే దానిపై బాహుబలి 2 పై అంచనాలు మరింత  పెరిగేలా చేసింది. ప్రభాస్, రానాల మధ్య యుద్ధ సన్నివేశాలు బాహుబలి 2 కి హైలెట్‌గా నిలిచాయి. అలాగే ఈ సినిమాలోని ఆర్మడాను గుర్తుకు తెచ్చే ఓడ, మాహిష్మతి రాజ్యపు నోటిని తలపించే అత్యంత భారీ ఏనుగు, హీరో హీరోయిన్లను తీసుకుపోతున్న బోటు చుట్టూ అలుముకున్న  ఊహాశక్తి ఇవన్నీ ఆర్ట్ వర్క్‌కు చెందిన అద్బుతమైన కృషికి చిహ్నాలు. నంబర్ వన్ స్థాయికి మించి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడు. నటీనటుల నుంచి అద్భుతమైన నటన తీసుకోవటంతో పాటు గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా ప్రతీ అంశంలోనూ ది బెస్ట్ అనిపించుకునే స్థాయిలో సినిమాను రూపొందించాడు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: