డైరెక్టర్ ముందుకొచ్చినా.. హీరోలు బ్యాక్ స్టెప్ వేస్తున్నారు..!
ఒకప్పుడు మణిరత్నం నుంచి కాల్ వస్తే చాలు పండుగ చేసుకునేవాళ్లు హీరోలు. తెలుగు స్టార్స్ కూడా ఈ మేకర్ తో సినిమాలు చేయడానికి తెగ ఉత్సాహం చూపించే వాళ్లు. కానీ ఇప్పుడు మణిరత్నం ప్రపోజల్ తీసుకొచ్చినా వెనుకడుగు వేస్తున్నారు. సారీ అంటూ తప్పించుకుంటున్నారు. మరి మణిరత్నంను వీళ్లు ఎందుకు సైడ్ చేస్తున్నారు.
మణిరత్నం సినిమా అంటే సౌత్ నుంచి మొదలుపెడితే నార్త్ వరకు సూపర్ ఫాలోయింగ్ ఉండేది. షారుఖ్ ఖాన్ లాంటి హీరోలు కూడా మణి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపించేవాళ్లు. అయితే ఇప్పుడు మణిరత్నం మూవీ అంటేనే వెనుకడుగు వేస్తున్నారు. మణిరత్నం ఫ్లాపుల్లో ఉన్నాడని చిన్నహీరోలు కూడా ఈ స్టార్ మేకర్ కు నో చెబుతున్నారు.
మణిరత్నం తన రేంజ్ కు తగ్గ హిట్ చూసి చాలా రోజులైంది. కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర మణిరత్నం మేజిక్స్ పనిచేయడం లేదు. క్రియేటివ్ మేకింగ్ తో ఇంప్రెస్ చేసే మణిశర్మ ఇప్పుడు ప్రేక్షకులను ఫుల్ గా శాటిస్ ఫై చేసేందుకు కష్టపడుతున్నాడు. ఈ స్టేజ్ లో ఒక వెబ్ సిరీస్ నిర్మించాలనుకున్నాడు మణిరత్నం. నవరస అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేశాడు. తమిళ్, తెలుగు స్టార్స్ తో సినిమా తీసేందుకు ట్రై చేశాడు.
తమిళ్ నుంచి అరవింద్ స్వామీ, సూర్య, సిద్దార్థ్ ని తీసుకున్నాడు మణిరత్నం. ఇక 9ఎపిసోడ్స్ ఉండే ఈ సిరీస్ కు తెలుగు నుంచి నలుగురు హీరోలని కాంటాక్ట్ చేశాడు. నాగార్జున, నాని, నాగచైతన్య, కార్తికేయని అడిగాడట మణిరత్నం. అయితే నాని, చైతన్య ఇద్దరు ఈ సిరీస్ కి నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. స్టోరీని మణి సూపర్ వైజ్ చేస్తాడని, నటించేందుకు ఒప్పుకోలేదట హీరోలు.
నాని, నాగచైతన్య ఇద్దరూ ఇంకా మార్కెట్ ను ప్రభావితం చేసే స్టేజ్ కు రీచ్ అవ్వలేదు. అలాంటి హీరోలు కూడా మణిరత్నం ఆఫర్ ను రిజక్ట్ చేశారంటే.. ఈ మేకర్ రేంజ్ నేలకు చేరిందనే చెప్పొచ్చు అంటున్నారు జనాలు. మరి మణిరత్నం మళ్లీ ఎప్పుడు ఫామ్ లోకి వస్తాడు.. భారీ హిస్టారికల్ డ్రామాగా ప్లాన్ చేసిన పొన్నియన్ సెల్వన్ తో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అనేది చూడాలి.