
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ అనుపమ..!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమం రోజురోజుకు ఉద్యమంలా ముందుకు కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు వస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగానే ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన అనుపమ పరమేశ్వరన్ మంగళవారం కేరళలోని తిరుచూరులో తన నివాసంలో ఒక మొక్కను నాటారు.
అయితే అనుపమ పరమేశ్వరన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు కొనసాగాలని అందరు బాధ్యతగా మొక్కలు నాటాలని అనుపమ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అనుపమ మరొక 12 మందిని మొక్కలు నాటాలని చాలెంజ్ లో కోరుతున్నానని కాళిదాస్ జయరామ్; నివితా థామస్, ఆహన కృష్ణ, రాజీష్ విజయాన్, పద్మ సౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాకు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అదే విధంగా ఈ చాలెంజ్ ను ముందుకు తీసుకుపోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదేవిధంగా ఈ యొక్క ఛాలెంజ్ ను ఇంకా పెద్ద ఎత్తున అందరు ముందుకు తీసుకోనిపోయి బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని రక్షిస్తే మనకు ఆక్సిజన్; నీడను ఇస్తాయి అని తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఈ చాలెంజ్ స్వీకరించి ముందుకు తీసుకెళ్లాలని ఆమె కోరుతున్నారు.