
సినీ పరిశ్రమలో విషాదం... ఆ నటుడు మృతి... సీఎం సంతాపం
ఈ యేడాది భారతదేశానికి ఏ రంగంలోనూ పూర్తిగా కలిసి రావడం లేదు. ఈ యేడాది ఆరంభంలో మినహా ఆ తర్వాత దేశంలోకి ఎప్పుడు అయితే కరోనా ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. చివరకు ప్రజలకు కనీసం తినడానికి తిండి దొరికే పరిస్థితి కూడా చాలా చోట్ల లేదు. ఎంతో మంది ధనవంతులు సైతం బయటకు రావాలన్నా... స్వేచ్ఛగా ఉండాలన్నా కూడా బిక్కుబిక్కు మంటోన్న పరిస్థితి. ఇక సినిమా ఇండస్ట్రీనీ యేడాది వరుస విషాదాలు కుదిపేశాయి.
బాలీవుడ్‌లో ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ నటుడు నవాజ్ సిద్ధిఖీ క్యాన్సర్‌తో మృతి చెందారు. ఇక మరో యువ హీరోయిన్ సైతం క్యాన్సర్ భారీన పడి మృతి చెందింది. ఇక మరో వర్థమాన హీరో సుశాంత్ రాజ్‌ఫుత్ అందరికి షాక్ ఇస్తూ ఏకంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కదిలించింది. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఒడియా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు బిజయ్ మొహంతి (70) సోమవారం సాయంత్రం కన్నుమూశారు.
ఒడిశా సినీ పరిశ్రమలో ఎంతో సీనియర్ అయిన ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మృతికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంతాపం తెలిపారు. బిజయ్ మొహంతి భార్య తాండ్రా రే కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరికి కుమార్తె జాస్మిన్ ఉన్నారు. ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలని సీఎం ఆదేశించారు.