జై లవ కుశ సినిమాలో మూడు పాత్రలను తనదైన శైలిలో మెప్పించిన నటుడు జూనియర్ ఎన్టీఆర్
మాస్ హీరోగా ఎన్టీఆర్ కు ఒక క్రేజ్ ఉంది. డైలాగ్స్ చెప్పడంలో, డాన్సు వేయడంలోను తారక్ ది విభిన్నమైన శైలి.అలాగే ప్రేక్షకులు, అభిమానులు ఎన్టీఆర్లో ఏలాంటి అంశాలను చూడాలనుకొంటారో అలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన చిత్రం " జై లవ కుశ" ఇటీవల కాలంలో ఒక్క పాత్రను చేసి మెప్పించడమే హీరోలకు కష్టంగా మారుతున్నది. అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ మూడు పాత్రలతో సినిమాను భుజాన వేసుకుని మోశాడు.ఇంకా సినిమా విషయానికి వస్తే జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక అనాధ పాత్రను పోషించాడు.
చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతారు అనాదలయిన ఈ ముగ్గురిని మేనమామ అయిన పోసాని మురళీకృష్ణ పెంచి పోషిస్తాడు. అయితే ఈ ముగ్గురికి నాటకాలు వేయడం అంటే ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జై అందరిలోకి పెద్దవాడు అలాగే పుట్టుకతోనే నత్తితో పుడతాడు. ఈ నత్తి కారణంగా జైని తన మేనమామ తొక్కేస్తాడు.చిన్నతనంలో కుటుంబ సభ్యుల వివిక్షకు గురైన జై పాత్రను ఎన్టీఆర్ అద్భుతంగా పోషించాడు. ఈ చిత్రానికి జై పాత్ర ప్రాణం పోసింది. అమ్మ నాన్నలు లేని జై సోదరులతో కలవాలనుకుంటాడు. కానీ లవ, కుశ అందుకు విరుద్ధంగా జై ని కలవనివ్వరు. దీనితో తనకు గుర్తింపు లేకుండా పోవడంతో తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటారు. ఓ నాటకంలో జరిగిన ప్రమాద ఘటన వల్ల ముగ్గురు సోదరులు విడిపోతారు. వారు అలా వేర్వేరు ప్రదేశాల్లోపెరిగి పెద్దవుతారు.
బాల్యంలో జై రావణుడిగా మారే తీరును.. అలాగే పెద్దయ్యాక సోదరుల ప్రేమకు కరిగిపోయి రావణుడు రాముడిగా మారే విధానములో ఎన్టీఆర్ ఒదిగిపోయాడు. అలాగే సినిమాలోని క్లైమాక్స్ సీన్ బాగా పండించాడు జూనియర్ ఎన్టీఆర్. చివరి పది నిమిషాల్లో జై పాత్రలో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది. అనాధగా పెరిగిన అన్నదమ్ముల్లో ఒక్కసారిగా సెంటిమెంట్ పెరిగి అన్న దమ్మల ఆప్యాయత గుర్తొస్తుంది. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు. కథలో ఉన్న కొన్ని లోపాలను తన యాక్టింగ్తో సరిదిద్దాడు. జై పాత్రలో దుష్ణుడిగా, లవ పాత్రలో లవర్ బాయ్గా, కుశుడు పాత్రలో చిల్లర దొంగ మూడు విభిన్నపాత్రలతో ఆకట్టుకొన్నాడు జూనియర్ ఎన్టీఆర్ .. !!