టెంపర్ సినిమాలో నన్ను కొట్టండి నాన్న అని అడిగి మరి కొట్టించుకున్న జూనియర్ ఎన్టీఆర్..!
ప్రస్తుతం టాలీవుడ్ లో విజయపధంలో దూసుకుపోతున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. బాలనటుడి నుంచి మొదలుపెట్టి అగ్రకథానాయకుడి స్థానంలో నిలిచిన నటుడు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ . ఇప్పుడు యంగ్ హీరోల్లో ఫామ్ లో ఉన్న టాప్ హీరో. తనదైన శైలిలో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో సత్తాచూపిస్తున్నాడు .విభిన్న పాత్రలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగుప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకుంది.
తారక్‌లోని పూర్తి నటుడ్ని ఈ సినిమాతో వెలికితీసాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. అంతేకాదు ఎన్టీఆర్‌లోని నెగిటివ్ షేడ్స్‌ని ఈ చిత్రం ఆవిష్కరిచంది.'టెంపర్’ మూవీలో ఎన్టీఆర్ ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనను ఎవరు మరిచిపోలేదు.నటుడిగా ఎన్టీఆర్‌ను మరో మెట్టు పైకెక్కించింది ‘టెంపర్’ మూవీ.జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్ర అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక అనాధ గా నటించాడు.
మంచి చెడు చెప్పడానికి అమ్మ, నాన్న, నా అనుకునే బంధువులు ఎవరు లేని ఒక అనాధ పాత్రలో నటించాడు. దయ పాత్రలో నటించిన ఎన్టీఆర్ కు దయ, జాలి అనేవి లేకుండా పెరిగి డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేసే పాత్ర అన్నమాట. ఈ పాత్రలో ఎంతో ఒదిగిపోయాడు యంగ్ టైగర్. అలాంటి దయ జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చి తన జీవితాన్నే మార్చివేస్తుంది. ఆ అమ్మాయి వల్ల జూనియర్ ఎన్టీఆర్ కు బంధం విలువ, బంధుత్వం విలువ, మంచి ఏంటో, చెడు ఏంటో తెలుస్తుంది.. అలా మొదలయిన దయ జీవితంలోకి అమ్మ, చెల్లి, నాన్న అనే ఎమోషన్స్ మొదలవుతాయి. ఇలా ఆ అనాధ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు. యాక్షన్లో పర్ ఫెక్షన్, డైలాగ్స్ లో ఎమోషన్, మూమెంట్స్ లో ఒక రకమైన రిథమ్ ను చూపించారు ఈ సినిమాలో. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెంపర్ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో "నాకు మంచి చెడు చెప్పడానికి అమ్మ, నాన్న లేరు. తప్పు చేస్తే తిట్టే అమ్మ లేదు కొట్టె నాన్న లేడు.. నన్ను మీ కొడుకనుకుని నన్ను కొట్టండి నాన్న "అని తనికెళ్ళ భరణితో చెప్పే డైలాగ్ ప్రేక్షకులకు కంట నీరు తెప్పించింది.అలాగే తన చెల్లికి న్యాయం చేయడానికి తాను మరణించడానికి అయినా సిద్దమే అని చెప్పే క్లైమాక్స్ సీన్ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టెంపర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఒక మైలురాయిలా ఉండిపోతుంది.