'యమదొంగ' లో అనాధగా యంగ్ టైగర్ నటన అద్భుతం .....!!

GVK Writings

చిన్నతనం నుండి దొంగ అయిన ఒక అనాధ కుర్రాడు, ఒక సందర్భంలో నరసింహస్వామి గుడి వద్ద తన వయసున్న ఒక అమ్మాయిని అనుకోకుండా కలుసుకోవటం, అనంతరం వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడడంతో, తన మెడలోని లాకెట్ ని తీసి వారి స్నేహానికి గుర్తుగా కుర్రాడికి ఇస్తుంది ఆ అమ్మాయి. అనంతరం దానిని షాపులో అమ్మి సొమ్ము చేసుకోవాలని చూసిన ఆ కుర్రాడికి, అది నకిలీ లాకెట్ అని తెలియడంతో దానిని విసిరి అవతల పారేస్తాడు. అయినప్పటికీ కూడా అది వదలకుండా పదే పదే అతడి వద్దకు వస్తుంది. 

 

ఆ విధంగా దొంగ గానే ఎదిగిన హీరో, కొన్నేళ్ళ తర్వాత ఒకానొక సమయంలో అనుకోకుండా ఒక అమ్మాయిని ఆపద నుండి రక్షించడం, ఆపై ఆమె కోటీశ్వరుల కూతురని తెలుసుకుని ఆమె కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని చూస్తాడు. అయితే ఆమె బంధువులు మాత్రం హీరో కుట్రను పసిగట్టి, అతడిని మరొకడితో హత్య చేయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆపై అవతలి వ్యక్తి చేతిలో హత్య గావింపబడి, హీరో ఆత్మ యమలోకానికి వెళ్ళటం, అక్కడ ఏకంగా యముడితోనే అతడు వివాదం పెట్టుకోవడం జరుగుతుంది. అదే సమయంలో అతడి చావుకు కారణం ఆ అమ్మాయి తరపు బంధువులు కాదు యముడని, ఒకానొక సమయంలో తప్పుగా తిట్టినందుకు ఆయనే కక్షగట్టి తన ఆయుష్షు తగ్గించి యమలోకానికి రప్పించాడని తెలుసుకుంటాడు. 

 

ఆ తరువాత యముడితో ఒప్పందం చేసుకునిభూలోకం వెళ్లడం, ఆపై ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుందని, అలానే ఆమెది నిజమైన ప్రేమ అని గ్రహించి, దాని కోసం తన ప్రాణాలను సైతం బలివ్వడానికి సిద్దమవుతాడు హీరో. కాగా ఈ మొత్తం కథలో అనాధైన దొంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గొప్ప నటన, డాన్స్, ఫైట్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి, ఈ సినిమాని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి ఎన్టీఆర్ కు హీరోగా మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: