'టక్కరిదొంగ' లో అనాదైన రాజా పాత్రలో మహేష్ యాక్టింగ్ అదుర్స్ .....!!

GVK Writings

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జయంత్ ఫల్క్రమ్ సినర్జీస్ బ్యానర్ పై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన కౌబాయ్ సినిమా టక్కరి దొంగ. 2002 జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించనప్పటికీ, టెక్నికల్ గా విమర్శకుల, అలానే ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది. మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామలు లిసారే, బిపాసాబసు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. 

 

తన చిన్నతనంలో డాక్టర్ అయిన తండ్రిని, అక్కను హత్య చేసి తాను అనాధగా పెరగటానికి కారకుడైనఒక ముసుగు వ్యక్తి కోసం హీరో రాజా వెతుకుతూ ఉంటాడు. ఆతరువాత అతడికి హీరోయిన్ తో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారుతుంది. కొంత సినిమా అనంతరం, తన తండ్రిని చంపిన వ్యక్తి ఎవరో నాకు తెలుసునని స్వయంగా విలనే హీరోకి చెప్పడం, ఆ ముసుగు వ్యక్తిని నీకు చూపించడానికి బదులుగా నాకు వజ్రాల లోయ నుండి వజ్రాలు తేవాలని మాట తీసుకోవడం జరుగుతుంది. అనంతరం వజ్రాల లోయకు వెళ్లి, వాటిని వెలికి తీస్తున్న సందర్భంలో, ఆ వ్యక్తి చేతికి ఉన్న గాటుని గమనించిన హీరో, తన తండ్రిని చంపింది అతడే అని తెలుసుకుని చివరకు పోరాడి హతమారుస్తాడు. 

 

ఆ విధంగా చిన్నతనంలోనే తండ్రి, అక్క హత్యానంతరం అనాథగా పెరిగిన రాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమాలోని కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సీన్స్ లో మహేష్ సహజ నటనను కనబరిచారు. గ్రాండ్ గా ఉండే విజువల్స్ తో పాటు, అదిరిపోయే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరోయిన్లు ఇద్దరి అందచందాలు వంటివి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ కూడా కౌబాయ్ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా ఈ టక్కరిదొంగ సినిమా నిలుస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: