రాంగోపాల్ వర్మకి చుక్కలు చూపించనున్న పవన్ కళ్యాణ్ అభిమానులు..!

Suma Kallamadi

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖు రాజకీయవేత్తల పై, నటుల పై కించపరిచే విధంగా సినిమాలు తీస్తూ వారి అభిమానుల మనోభావాలను దేబ్బతీసేలా ఉన్నాయని  టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే బూతు సినిమాలు తీస్తూ అందరి చేత బాగా తిట్టించుకుంటున్న రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులను బాగా రెచ్చ గొడుతున్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు రామ్ గోపాల్ వర్మ పై ప్రతీకారం తీర్చుకోవాలని బాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులోని భాగంగానే రామ్ గోపాల్ వర్మ పై పరాన్నజీవి అనే సినిమా తీసి అతడికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు. 


ఎప్పుడూ అందరిపై సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ పై మరొకరు సినిమా తీయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పరాన్న జీవి సినిమాకి బిగ్ బాస్ షోలో కనిపించిన నూతన నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానం కావడంతో రామ్ గోపాల్ వర్మ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సినిమాను ఎంతో కసిగా రూపొందిస్తున్నాడని తెలుస్తుంది. రాంగోపాల్ వర్మ ఆన్లైన్ లో తెరకెక్కించే పవర్ స్టార్ అనే సినిమా 30 నిమిషాల నిడివితో ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా చూసేందుకు 150 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 


ఈ సినిమా శ్రేయ ఈటీ అప్లికేషన్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు హెచ్చరికలతో ఈ సినిమా విడుదల చేసేందుకు చేయాలి శ్రేయస్ ఈటి అప్లికేషన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కానీ వర్మపై రూపొందిస్తున్న పరాన్నజీవి సినిమా మాత్రం ఈ అప్లికేషన్ లోనే విడుదల కావడం గమనార్హం. మరి పరాన్నజీవి సినిమాలో రామ్ గోపాల్ వర్మ పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఐతే పరాన్నజీవి సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. ఏది ఏమైనా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: